సోము స్వరంలో మార్పు.. జనసేనానికి భయపడ్డడా ఏంటి..?

somu veerraju

 ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు అందుకున్న నాటి నుండి సోము వీర్రాజు నోటికి గట్టిగా పని చెప్పటం ప్రారంభించాడు. మీడియా కూడా ఆయన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. ఇంతలో తెలంగాణలో బీజేపీ ఊహించని ఫలితాలు సాధించటంతో అవే ఫలితాలు త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సాధిస్తామని ఎక్కడ లేని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కూడా మాట్లాడాడు.

somu veerraju

 ఈ ఒక్క మాటే సోము వీర్రాజుకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తిరుపతి టిక్కెట్ విషయం బీజేపీ – జనసేన కలిసి మాట్లాడుకొని అభ్యర్థిని ఖరారు చేస్తారని స్వయంగా పవన్ కళ్యాణ్ కానీ సోము ఇలా స్టేట్మెంట్ ఇవ్వటంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు . సోషల్ మీడియాలో బీజేపీని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు, ఇదే అదునుగా కొన్ని మీడియా సంస్థలు బీజేపీ, జనసేన మధ్య మిత్ర బేధం తలెత్తింది. పొత్తు తెగదెంపులు చేసుకోబోతున్నారు అనే వార్తలు ప్రచురించాయి.

 దీనితో బీజేపీ ఉలిక్కిపడ్డ బీజేపీ నష్ట నివారణ చర్యలు చెప్పట్టింది. తిరుపతిలో నూతన బీజేపీ కార్యాలయాలన్ని ప్రారంభించిన సోము వీర్రాజు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు.. అభ్యర్థి ఎవరనేది తొందరలోనే హైకమాండ్ వేసిన కమిటీ డిసైడ్ చేస్తుందని.. ఎవరైనా బీజేపీ, జనసేన కలిసే ఈ ఎన్నికల్లో సాగుతుందని సోము వీర్రాజు ఊహాగానాలకు తెరదించారు.

 తిరుపతిలో జనసేన మద్దతు లేకుండా బీజేపీ కనీసం నోటా కంటే ఎక్కువ ఓట్లు సాధించలేదని వాళ్లకు తెలుసు, స్థానికంగా జనసేనకు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు పుష్కలంగా ఉన్నాయి. గెలిచే స్థాయిలో లేకపోయిన గెలుపును ప్రభావితం చేసే ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ సొంతం. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో త్యాగం చేసి మరి తిరుపతి పార్లమెంట్ స్థానం కోసం పవన్ కళ్యాణ్ పట్టు పడుతున్నాడు. మరోపక్క బీజేపీ మాత్రం ఈ స్థానంలో తమ అభ్యర్థిని రంగంలోని దించాలని చూస్తుంది. అందులో భాగంగానే సోము వీర్రాజు ఒక రాయి వేసి చూశాడు .. కానీ అదే రాయి తిరిగి బలంగా తగలటంతో ఇప్పుడు మెల్లగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.