గత కొద్దీ నెలలుగా కనీసం బయటకు రావటానికి ఒకటి పదిసార్లు అలోచించి హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు నాయుడు, గత రెండు రోజుల నుండి జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరుచూస్తే ఎవరికైనా సరే బాబులో ఇంత మార్పేమిటి అనే సందేహం కలగకమానదు. గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ చేతిలో అనేక అవమానాలు చవిచూసిన చంద్రబాబు ఈ ధపా కొంచం వెనక్కి తగ్గుతాడేమో అని అనుకుంటే దానిని విరుద్ధంగా సై అంటే సై అంటూ ముందుకు దూకుతున్నాడు, ఆయన వాలకం చూసి సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్న పరిస్థితి.
గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ వెల్ లోకి వెళ్లి నిరసన తెలపాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు కు ఏమి వచ్చింది అంటే..? చేజారిపోతున్న ఎమ్మెల్యేలపై పట్టు సాధించుకునేందుకే, తన అను”కుల” మీడియాలో హంగామా చేసేందుకు, ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇలా చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. తుపాను సమయంలో జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీడీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. సభలో చర్చ జరక్కుండా గందరగోళం సృష్టించారు.
చంద్రబాబు ప్రవర్తన మరీ విడ్డూరంగా ఉంది. మంత్రి సమాధానం చెప్పకుండా అడుగడుగునా అడ్డుతగిలిన బాబు.. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతున్నా కూడా మైక్ తనకి కావాలని అడిగారు. దీనితో టీడీపీ ఎమ్మెల్యేలు బిక్కమొఖం వేశారు. అవతలి పార్టీ నేతలు మాట్లాడుతున్న సమయంలో మైక్ కావాలని, లేదా వాళ్ళ మాటలకూ అడ్డు పడటం చూసాం కానీ, సొంత పార్టీ నేతలు మాట్లాడుకున్న సమయంలో కూడా మైక్ కావాలని అడ్డుపడటం ఏమిటో తెలియక టీడీపీ ఎమ్మెల్యే లు బిత్తరపోయారు. అసలు మాట్లాడటమే అనవసరం చేస్తే గోల గోల చేసి నుండి సస్పెండ్ అయ్యి, అసెంబ్లీ ముందు కాసేపు హంగామా చేసి, సరిగ్గా 6 గంటలకు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుందని అన్నట్లు బాబు వ్యవహారశైలి కనిపిస్తుంది.