జేసీకి బాబు ఊహించని షాక్.. జగన్ నయం

jc jagan and babu

 అనంతపురం రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుండి అనంత రాజకీయాల్లో చక్రం తిప్పిన ఫ్యామిలీ వాళ్ళది. అలాంటి కుటుంబానికి ఇప్పుడు రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏడాదిన్నర కిందట అనంతపురంలో తమకు తిరుగులేదని అనుకున్న జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు.. నేడు.. తమను గుర్తించేవారే లేకుండా పోయారని విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వీరిని నమ్ముకున్న కేడర్ కూడా జారిపోతోందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ పార్టీలో కూడా వాళ్ళను పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు.

jc brothers political

 ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పార్టీ ప్రకటించిన పార్లమెంటరీ పదవుల్లో కానీ, జాతీయ,రాష్ట్ర స్థాయి పదవుల్లో కానీ జేసీ ఫ్యామిలీ నుండి ఒకరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి ఉన్నకాని ఎవరిని కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు చంద్రబాబు. ప్రభాకర్ రెడ్డి పై జగన్ సర్కార్ కేసులు పెట్టినప్పుడు కరోనా ను కూడా లెక్కచేయకుండా లోకేష్ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చాడు. పార్టీ పరంగా అంత విలువ ఇచ్చిన బాబు, పార్టీ పదవుల్లో మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవటం ఏమిటనేది ఎవరికీ అర్ధం కాలేదు.

 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ వ్యవహార శైలిపై అనేక విమర్శలు వచ్చిన చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో బాబును బెదిరించి మరి జేసీ దివాకర్ రెడ్డి తాను పనులు చక్కబెట్టుకున్నాడనే మాటలు వినవచ్చాయి. అవన్నీ కూడా బాబు మర్చిపోలేదని సమయం వచ్చినప్పుడు లెక్క సరిచేయొచ్చనే ఆలోచనలో ఉన్నాడు. పైగా అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ మెల్లమెల్లగా తను పట్టును కోల్పోతుంది. ఈ నేపథ్యంలో జేసీ ఫ్యామిలీతో పార్టీకి ఒనగూరే లాభం కూడా లేదని బాబు అనుకున్నట్లు తెలుస్తుంది.

jc family

 అందుకే అసలు జేసీ ఫ్యామిలీతో పరిచయమే లేని కాల్వ శ్రీనివాసులు అనంతపురం ఇంచార్జి గా నియమించాడు బాబు. దానిని బట్టి చూస్తే ఇక జేసీ ఫ్యామిలీ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే మంచిదనే సంకేతాలు చంద్రబాబు పంపినట్లు తెలుస్తుంది. పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వకపోగా, సొంత జిల్లాలో కూడా పట్టించుకోలేదు బాబు, ఇంతకంటే అవమానం ఇంకొకటి లేదు జేసీ ఫ్యామిలీకి.. ఒక రకంగా చూసుకుంటే జేసీ ఫ్యామిలీ విషయంలో సీఎం జగన్ నయం అని అనిపిస్తుంది. కేవలం ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి లను జైలు కు పంపించి వదిలేశాడు, కానీ బాబు మాత్రం ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు.