తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటైతే నీటి యుద్ధాలు జరుగుతాయని నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందే చెప్పారు. ఎంత కలిసుందామని ప్రయత్నించినా రెండు రాష్ర్టాల మధ్య నీళ్లు యుద్ధాన్ని తీసుకొస్తాయని నాటి అసెంబ్లీలో బల్లగుద్ది మరీ ఉద్ఘాటించారు. అప్పటికే ఇలాంటి వార్ ని ఎదుర్కోంటున్న రాష్ర్టాలన్ని అసెంబ్లీ సాక్షిగా ఉదహరించడం జరిగింది. సరిగ్గా ఇప్పుడా కిరణ్ కుమార్ రెడ్డి మాటలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ రాష్ర్టాల మధ్య అదే యుద్ధం జరుగుతుంది. రాష్ర్టాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని అనుకుంటున్నా! వర్కౌట్ అవ్వడం లేదు.
కృష్ణా జలాలు, గోదావరి జలాల పంపిణీ విషయంపై కొన్నాళ్లగా రెండు రాష్ర్టాల జలవనరుల శాఖలు మాటలు విసురుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్ లోకి ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ఆరు సార్లు భేటీ అవ్వడం జరిగింది. అన్నిసార్లు భేటీలైతే జరిగాయి గానీ సమస్యలను తాత్కలికంగా పరిష్కరించుకోవడం తప్ప పర్మినెంట్ సొల్యుషన్ అనేది దొరకలేదు. అపై ఎవరు చేసేది వాళ్లు చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు. అటుపై రెండు రాష్ర్టాలు ఎవరికి వారు అక్రమంగా ప్రాజెక్ట్ లు చేపడుతున్నారని ఆరోపించుకున్నాయి. కృష్ణా వాటర్ బోర్డ్ , గోదావరి వాటర్ బోర్డు ముందుకు అధికారులు పంచాయతీకి వెళ్లినా వివాదం తేలలేదు. అపెక్స్ కమిటీ ముందుకు రెడీ అయ్యారు.
అయితే ఇంతలోనే ఈ వివాదం పై కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన నిప్పులు చెరిగారు. ఏపీ తీరును ఆయన తీవ్రంగా ఖండించి తప్పు బట్టారు. కేంద్రం కూడా ఏపీకే పక్షపాతిగా వ్యవహరిస్తుందని..ఈవిషయాన్ని అంత ఈజీగా వదలనంటూ తనదన శైలిలో మరోసారి హెచ్చరించారు. అయితే అంతే ధీటుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పేసారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కి జగన్ ఓ లేఖ కూడా రాసారు. అందులో తెలంగాణ ప్రభుత్వం తప్పిదాల్ని ఎత్తి చూపారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ వైఖరి ఎలా ఉంటుంది? కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అన్నది జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.