జగన్ ను తట్టుకోవటం నాతో కాదు… చేతులెత్తేసిన చంద్రబాబు..?

cbn jagan chandrababu naidu

 సీఎం జగన్ దూకుడు ముందు చంద్రబాబు నాయుడు చాలా వరకు వెనక్కి తగ్గినట్లే కనిపిస్తుంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడు ముందు టీడీపీ నిలబడలేక మౌనం వహిస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో కూడా ప్రస్తుతం వైసీపీని తట్టుకోలేక కొన్నిటిని ధారాదత్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అదే కోవలో కుప్పం నియోజకవర్గం కూడా చేరబోతున్నట్లు స్వయంగా తెలుగు తమ్ముళ్లే చెపుతున్నారు.

cbn jagan chandrababu naidu

 చంద్రబాబు నాయుడు గత మూడు దశాబ్దాల నుండి పోటీ చేసి విజయం సాధిస్తున్న నియోజకవర్గం కుప్పం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎటు పోయిన కానీ సొంత నియోజకవర్గంలో అయిన పట్టు నిలుపుకోవాల్సిన కనీసం బాధ్యత బాబు మీద వుంది, కానీ ఆయన వాలకం చూస్తే పోతేపోనీ అన్నట్లు ఉందని అక్కడి స్థానిక టీడీపీ నేతలే చెపుతున్నారు, దానికి కారణం వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు అనే చెప్పాలి. చంద్రబాబును కూడా ఓడించాలనే సంకల్పంతో ఇక్కడ వైసీపీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

 దీంతో చంద్రబాబుకు ఇబ్బంది కర పరిస్థితులు మొదలయ్యాయని అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో టీడీపీని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆ పార్టీ శ్రేణులను వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రలోభాలు బలవంతాలు అవసరమైతే.. కేసులకు కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ చంద్రబాబు మాత్రం కుప్పం విషయంలో మారుమాట్లాడక పోవటంపై టీడీపీ నేతలే ఆగ్రహంతో వున్నారు.

cbn

 గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ ఇలాంటి వ్యూహాలే అమలుచేసింది. రాయలసీమ మొత్తం మీద ఒక్క కడపకు అధికంగా నిధులు విడుదల చేసి, కోట్లు కుమ్మరించింది, కానీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అదే ఫార్మాలను ఇప్పుడు వైసీపీ పార్టీ అమలుచేస్తుంది, ఫలితం మాత్రం అనుకున్న విధంగా వచ్చేలాగానే కనిపిస్తుందని వైసీపీ నేతలు చెపుతున్నారు. చూస్తూ చూస్తూ బాబు చేతిలో నుండి కుప్పం జారిపోతే వచ్చే ఎన్నికల నాటికీ బాబుకు కష్ట కాలం రావటం ఖాయం. తన కొడుకు లోకేష్ సురక్షితమైన స్థానమంటూ ఏది లేదు. ఇలాంటి సమయంలో తనకు అనుకూలమైన కుప్పం కూడా బాబు వదులుకుంటే తండ్రి కొడుకులకు ఇక శంకరగిరి మాన్యాలే దిక్కంటూ వైసీపీ నేతలు చమక్కులు విసురుతున్నారు.