కరోనా వల్ల ఉద్యోగం పోయిందా? ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? చంద్రబాబుతో జతకట్టి ఇలా సాయం పొందండి

Chandrababu Naidu doing wrong propaganda by using NV Ramana 

కరోనా వైరస్ వల్ల ఒక్క ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచమంతా అతలాకుతలం అయింది. ఉన్న ఉద్యోగాలు పోయాయి. పని లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. కొందరికైతే పూట కూడా గడవడం లేదు. ఇలా.. ఎందరో కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి.. కరోనా వల్ల నష్టపోయిన వాళ్లందరికీ ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతోందా? అంటే డౌటే.

chandrababu platform for who affected by corona
chandrababu platform for who affected by corona

అందుకే.. టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త ఆలోచన చేశారు. కరోనా వల్ల నష్టపోయిన వాళ్లందరినీ ఒకే తాటి మీదికి తీసుకురావడం కోసం ఒక ప్లాట్ ఫాంను సృష్టించారు. ఒక వెబ్ సైట్ ను క్రియేట్ చేసి.. దాంట్లో కరోనా వల్ల నష్టపోయిన వాళ్లందరు తమ వివరాలను పొందుపరచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

దానికి సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు చంద్రబాబు. ఏపీలో కరోనా కేసులు ఇప్పటికే 7 లక్షలు దాటిపోయాయని… 6 వేల దాకా మరణించారని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఇంతలా విజృంభిస్తున్నా.. కరోనాను నియంత్రించే పరిస్థితిలో మాత్రం రాష్ట్రం ప్రభుత్వం లేదు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా అనేక మంది జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. రైతుల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. ఏపీలో పేద కుటుంబాలు రోజూవారీ ఆహార ధాన్యాలకు కూడా కటకటలాడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుత రాజకీయ పార్టీగా రాష్ట్ర ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఒక ఓపెన్ ఫోరమ్ ను ఏర్పాటు చేసింది.

ఉపాధి కోల్పోవడం, మందులు దొరక్కపోవడం, సకాలంలో అంబులెన్స్ లు రాకపోవడం, ఇతర నిత్యావసరాల కొరత, పంట నష్టం.. ఇలా కరోనా సమస్య ఏదైనా apfightscorona.com పేరుతో తెలుగుదేశం ప్రారంభిస్తున్న వెబ్ సైట్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకురండి. మీ సమస్య పరిష్కారానికి పార్టీ ముందుండి పోరాడుతుంది.. అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

అయితే.. చంద్రబాబు సరికొత్త ఐడియాపై ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి. కరోనా భయంతో ఇంట్లో దాక్కొని.. పక్క రాష్ట్రంలో దాక్కొని.. ఏపీకి ఏనాడూ వచ్చి కరోనా బాధితులను పరామర్శించని చంద్రబాబు.. ఇప్పుడు కరోనా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.