ఏపీలో ప్రస్తుతం టీడీపీకి కావల్సింది యువ రక్తం. సరైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావాలి. పార్టీలోకి కొత్త రక్తం రావాలి. సరికొత్త నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారపక్షంవైపు నడిపే నాయకుడు కావాలి. కానీ.. ప్రస్తుతం టీడీపీలో అటువంటి పరిస్థితులు లేవు.
దీంతో.. ఎలాగైనా పార్టీలో పునరుత్తేజం తేవాలని భావించిన చంద్రబాబు.. పార్టీలో పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగానే… పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జ్ లను నియమించారు. అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఆ ప్రకటన మాత్రం చంద్రబాబు చేయలేదు.
నిజానికి.. ఏపీ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై ఏపీలో గత కొన్ని రోజుల నుంచి వాడీవేడీ చర్చ నడుస్తోంది. చంద్రబాబుకు అచ్చెన్నాయుడిపై నమ్మకముందని.. అచ్చెన్నాయుడు అయితేనే పార్టీని సరిగ్గా ముందుకు తీసుకెళ్లడని.. వైసీపీ నేతలకు సరైన కౌంటర్లు ఇవ్వగలడని భావించారు.
అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల టీడీపీ నేతలెవ్వరూ అభ్యంతరం చెప్పలేదు కానీ.. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు మాత్రం అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీలోని వేరే నేతలు ఎవ్వరు అడ్డుచెప్పినా చంద్రబాబు పట్టించుకునే వారు కాదు కానీ… నారా లోకేశ్ చెప్పేసరికి చంద్రబాబు సమాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
లోకేశ్ ఒత్తిడి చేయడంతోనే అచ్చెన్నాయుడి పేరును చంద్రబాబు ప్రకటించలేదట. కానీ.. బాగా ఆలోచించుకున్న చంద్రబాబు.. ఏపీ టీడీపీ అధ్యక్ష పీఠాన్ని అచ్చెన్నాయుడికే అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కొడుకు నారా లోకేశ్ మాటను కూడా చంద్రబాబు వినడం లేదట. లోకేశ్ మాటను కూడా పక్కన పెట్టి.. త్వరలోనే అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష పీఠాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారట.
దానికి కారణం.. ప్రస్తుతం పార్టీలో, ఏపీలో ఉన్న పరిస్థితులేనట. టీడీపీకి ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే అచ్చెన్నకు ఖచ్చితంగా అధ్యక్ష పదవిని అప్పగించాల్సిందేనని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట. అందుకే.. లోకేశ్ మాటను చంద్రబాబు పక్కన పెట్టారట. దీంతో అయ్యో పాపం లోకేశ్ బాబు.. కనీసం చంద్రబాబు నీ మాటను కూడా వినడం లేదుగా అంటూ మరో ప్రచారం సాగుతోంది.