ప‌చ్చచొక్కాలను పరేషాన్ చేస్తున్న చంద్రబాబు.. ఇక రాజకీయ జీవితం ముగిసినట్లేనా.. ??

 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చాంశనీయమైందట.. అసలే పార్టీలో ఆక్సిజన్ సరిపడ లేక వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందో, మాయం అవుతుందో తెలియని ఆందోళనలో ఉన్న ఆ పార్టీ నాయకులకు గత కొద్ది రోజులుగా చంద్రబాబు దర్శనం దొరకడం లేదట.. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్నా పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం, మరికొన్ని చోట్ల అసంతృప్తుల మంటలు రగులుతుండటం దీనికి తోడుగా మా పార్టీలోకి టీడీపీ నుండి ఎంత మంది అయినా వలస రావచ్చూ అంటూ వైసీపీ తలుపులు తెరచి ఉంచడం ఇలా జరుగుతున్న పరిణామాలను టీడీపీ అధినేత చంద్రబాబు గమనిస్తున్నారా లేదా అనే అనుమానం ఇప్పటికే పార్టీ కేడర్‌లో మొదలైందట..

అదీగాక క‌రోనా భ‌యంతో కొన్ని నెల‌లుగా హైద‌రాబాద్ కు ప‌రిమితం అయినా చంద్ర‌బాబు ప్రస్తుతం క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న పచ్చచొక్కాలను కలిసి పార్టీ బలోపేతం కోసం చర్చించే అవకాశం కూడా ఇవ్వడం లేదట.. అంతే కాకుండా ఆయన అమ‌రావ‌తి ప్రాంతానికి వచ్చినా గానీ తమ పార్టీ నాయకులను కలవడానికి జంకుతున్నారట.దీంతో ఆయ‌న ఏపీకి వ‌చ్చాడ‌ని జబ్బలు ఎగరేసుకుంటూ వెళ్లిన నాయకులకు నిరాశే మిగిలిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పచ్చ చొక్కాలను కలవకుండా ఇంత పరెషాన్ చేస్తున్న బాబుగారు ఏపీకి ఎందుకు వ‌చ్చిన‌ట్లు.. హైద‌రాబాద్ లోనే ఉంటే సరిపోయేది కదా అని ప‌చ్చ‌చొక్కాలు ప్ర‌స్తావించుకుంటున్నాయ‌ట‌. అయితే చంద్ర‌బాబు తీరులో మాత్రం మార్పులేదు..

ఇకపోతే ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ అధినేత ఇలా నెల‌లు నెల‌లు క్యాడ‌ర్ కు, ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటే.. ఆటోమెటిక్ గా ప్ర‌జ‌లు స‌ద‌రు నేత‌ను మ‌రిచిపోతారు. ఇప్పుడు చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఎన్ని జూమ్ మీటింగులు పెడితే మాత్రం.. ఒక వంద మంది కార్య‌క‌ర్త‌ల‌తో డైరెక్టుగా కలిసినంత ఫీల్ వస్తుందా.. అయితే చంద్రబాబుకు వ‌య‌సు మీద ప‌డింది.. మరి ఆయన పుత్రుడు లోకేష్ ఏం చేస్తున్న‌ట్టు అని ప్రశ్నించుకుంటున్నారట.. ఇదే కాకుండా జూమ్, ట్విట్ట‌ర్లతోనే రాజ‌కీయం అనే భ్ర‌మ‌ల్లో చంద్ర‌బాబు, లోకేష్ లు మునిగిన‌ట్టుగా ప్రచారం అవుతుంది.

ఇలా ఊహల్లో బ్రతికే బదులుగా క్షేత్ర స్థాయికి వెళితే పార్టీ పరిస్దితి ఏంటో అర్థం అవుతుందంటున్నారు.. కానీ చంద్ర‌బాబు, లోకేష్ ల‌కు అలా వెళ్లే ఉద్దేశం కూడా ఉన్న‌ట్టుగా లేన‌ట్టుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్దితుల్లో చంద్రబాబు రాజకీయ జీవితానికి పులిస్టాప్ పెట్టేస్తే పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు అనే సమాధానం లేని ప్రశ్నలు టీడీపీ వర్గాల్లో పుట్టుకొస్తున్నాయట.. మరి చంద్రబాబు మనసులో ఏముందో ఆయనే తెలియాలి..