ఎన్టీఆర్ సిద్ధాంతాలను కూడా బాబు లెక్క చెయ్యడా!! బీజేపీ దారిలోకి బాబు. వెళ్తున్నాడా!!

Will Bharat Ratna come to NTR?

అన్న నందమూరి తారక రామారావు కాంగ్రెస్ యొక్క అప్రజాస్వామిక పాలనను అంతం చెయ్యడానికి, తెలుగు వాడికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొని రావడానికి తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆయన కుల, మతాలకు అతీతంగా పార్టీని ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్టీఆర్ యొక్క సిద్ధాంతాలను తుంగలో తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. కుల, మత రాజకీయాలకు ఎన్టీఆర్ హయాంలో టీడీపీ దూరంగా ఉండేది, కానీ ఇప్పుడు కులాలతో, మతాలతో రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలోకి బీజేపీ రావడానికి ప్రయత్నాలు చెయ్యడం మొదలు పెట్టినప్పటి నుండి బాబు కూడా హిందుత్వ వాదాన్ని ఎత్తుకొని ముందుకు నడవడానికి సిద్ధమయ్యారు.

cbn
cbn

బీజేపీ బాటలోకి బాబు వెళ్తున్నారా!!

బీజేపీ యొక్క రాజకీయ ఆయుధం ఏదైనా ఉందంటే కులాలు,మతాల ద్వారా రాజకీయాలు చెయ్యడం. ప్రజల్లో హిందుత్వ భావాలను రెచ్చగొడుతూ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా హిందుత్వ భావనను రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో పతనానికి చేరువలో ఉన్న టీడీపీ కూడా ఇప్పుడు మత రాజకీయాలు చెయ్యడం మొదలు పెట్టింది. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష అన్న చంద్రబాబు ఇపుడు అదే బీజేపీ లైన్ లో వెళ్తూ ధర్మ పరిరక్షణ అంటున్నారు. మరీ ఇలా గాలివాటం రాజకీయాలు చేస్తే ఎలా అన్నది పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉంటున్న వారి ఆవేదనగా ఉంది.

వైసీపీకి లాభం కానుందా!!

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలు మంచి చేసిందో లేదో పక్కన పెడితే, అందరిని సమానంగా చూస్తూ, ప్రజలకు మరింత చేరువ అవుతుంది. కానీ టీడీపీ మాత్రం ఇప్పుడు హిందుత్వ వాదనను ఎత్తుకోవడం వల్ల ఇప్పటికే కొన్ని వర్గాల ప్రజలను టీడీపీ కోల్పోయింది. టీడీపీ కోల్పోయిన ఈ వర్గాల ప్రజలను వైసీపీ నాయకులు అక్కున చేర్చుకుంటున్నారు. పతనానికి చేరువలో ఉన్న టీడీపీ ఇప్పుడు అనాలోచితంగా చేస్తున్న పనుల వల్ల తాను బలహీనపడటమే కాకుండా వైసీపీ మరింత బలపరుస్తుంది.