తన ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేయడంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆ ఎత్తుల్లో ఫేక్ ప్రచారం కూడ ఒకటి. తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం కోసం అవతలి పార్టీ ఇలా చేయబోతోంది, అలా మాట్లాడుతుంది అంటూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం స్టార్ట్ చేస్తారు. వాటి వలన జనంలో అవతలి పార్టీ మీద చంద్రబాబుకు అనుకూలమైన అభిప్రాయలు ఏర్పడతాయి. అవి బాబుకు ఉపకరిస్తాయని జనాలకు కూడ తెలియదు. వాటి ప్రభావం ఫలితాల్లో కనబడుతుంది. అవి చూసేదాకా ప్రజలు కూడ గుర్తుపట్టలేరు బాబుగారు తమను బురిడీ కొట్టించారని.
ప్రస్తుతం జగన్ విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో ఆవుతున్నారు ఆయన. ప్రభుత్వానికి, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్యన స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై పెద్ద యుద్ధమే జరుగుతోంది. ప్రభుత్వం కరోనా ఉంది ఎన్నికలు ఎలా పెడతాం అంటుంటే రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలు జరగాల్సిందే అంటున్నారు. కోర్టులో వాదోపవాదనలు నడుస్తున్నాయి. టీడీపీ మాత్రం ఎన్నికలు జరగాలనే కోరుకుంటోంది. సరే జరిగితే గెలిచేదేమైనా ఉందా అంటే అదీ లేదు. స్థానిక ఎన్నికలు అధికార పక్షానికే అనుకూలంగా ఉంటాయని చెప్పాల్సిన పని లేదు. అయితే ఇందుకోసం కూడ చంద్రబాబు వద్ద ఒక ప్లాన్ ఉందట.
అదేమిటంటే ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వద్దని అంటోంది. నిమ్మగడ్డ నిర్వహించిన ఆల్ పార్టీ సమావేశాన్ని కూడ బహిష్కరించింది. ఒకవేళ కోర్టు ఎన్నికలు పెట్టాలని అంటే నిమ్మగడ్డ నేతృత్వంలోనే జరగాలి. అప్పుడు వైసీపీ సమావేశాన్ని బహిష్కరించినట్టే ఎన్నికలను కూడ బహిష్కరిస్తుందా అంటూ ప్రచారం మొదలుపెట్టారు. తెలుగు తమ్ముళ్లు అందరూ ఇదే ప్రశ్నను సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రశ్నకు టెంప్ట్ అయి అవును బహిష్కరిస్తాం అంటే అప్పుడు ఒక్కరే స్థానిక ఎన్నికల్లో నిల్చుని మెజారిటీ సీట్లు పొందవచ్చనేది చంద్రబాబు వ్యూహం కావొచ్చు.