2019 ఎన్నికల్లో ఓటమి చూసిన టీడీపీ నాయకులు వైసీపీని దెబ్బకొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతిసారి వైసీపీపై టీడీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో వైసీపీని ఇబ్బందుల్లో పెట్టడానికి టీడీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి రైతులు అక్కడ ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కొత్త వ్యూహం రచించారు. ఈ వ్యూహానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
జగన్ ను దెబ్బకొట్టడానికి బాబు కొత్త వ్యూహం
అవకాశం దొరికిన ప్రతిసారి వైసీపీని దెబ్బకొట్టడానికి టీడీపీ నాయకులు, అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలను, అమరావతి రైతులను అడ్డుపెట్టుకొని వైసీపీని దెబ్బతియ్యడానికి వినూత్న పతకం రచించారు. ఈ పతకంతో వైసీపీ దెబ్బపడటం ఖాయంగా కనిపిస్తుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో అమరావతి రైతులతో కూడా నామినేషన్ వేయించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం రచించారు. గతంలో తెలంగాణలో పసుపు పరిశోధన కేంద్రం కోసం కేసీఆర్ కూతురు కవితపై దాదాపు 500మంది రైతులు నామినేషన్ వేశారు. ఇలా చెయ్యడం వల్ల దేశం మొత్తం రైతుల గురించి మాట్లాడింది. అలాగే ఇప్పుడు తిరుపతిలో కూడా అమరావతి రైతులతో నామినేషన్స్ వేయించి, రాజధాని రైతుల సమస్యలను దేశం మొత్తం తెలియజెయ్యడానికి, జగన్ ను నేషనల్ లెవల్ లో ఇబ్బందులకు గురి చెయ్యడానికి బాబు పతకం రచించారు.
బాబు వ్యూహానికి జగన్ దిగిరావాల్సిందేనా!!
చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహానికి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు బీజేపీ, జనసేన నాయకులు దిగివస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అమరావతి విషయంలో ఈ పార్టీలు తమను మోసం చేశాయని రైతులు భావిస్తున్నారని, ఈ పతకంను అడ్డుకోవాలంటే జగన్ కు అమరావతి రైతులతో చర్చలకు దిగిరావడం తప్ప వేరే మార్గం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహం ఫలిస్తే రైతుల్లో బాబుకు మద్దతు పెరగడం ఖాయం. ఈ మద్దతు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా టీడీపీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.