2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఈమధ్య కాలంలో సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంతో చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్ అయ్యాడు. ఇప్పటికే అనేకసార్లు సెల్ఫ్ గోల్స్ వేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరుమల వివాదంలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.
చంద్రబాబుకు ఈ మత రాజకీయాలు అవసరమా !
రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం గడించిన చంద్రబాబు నాయుడుకు ఈ మత రాజకీయాలు అవసరమా అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని మత రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన బీజేపీతో కలిసి బాబు కూడా జగన్ ను విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పటికే బీసీ లను దూరం చేసుకున్న టీడీపీ ఇప్పుడు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని జగన్ పై ఒత్తిడి తెస్తూ ఇంకో మతం యొక్క ఓట్లను బాబు కోల్పోయారని రాజకీయ వర్గాలు చర్చించునుకుంటున్నారు. కేవలం బీజేపీ యొక్క మెప్పు పొందడం కోసం ఇలా చేయడం చంద్రబాబు నాయుడుకు తగదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
గతంలో అడగని బాబు ఇప్పుడెందుకు రచ్చ చేస్తున్నారు?
గతంలో కూడా వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లారు, అప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డిని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కానీ ఇప్పుడు వైసీపీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ఠతను దెబ్బతియ్యడానికి డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని కావాలని డిమాండ్ చేస్తూ, ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారు. అలాగే గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదు కానీ అప్పుడు కూడా టీడీపీ నేతలు ప్రశ్నించలేదు. ఇప్పుడు కేవలం ప్రజల్లో వైసీపీని ఒక మతానికి వ్యతిరేకిని చేయడానికే బాబు ఈ పని చేస్తున్నారని ప్రజలకు ఇట్టే అర్ధమవుతుంది.