రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని మించిన వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన వేసిన వ్యూహాలకు ఇప్పటికే అనేకమంది నాయకుల రాజకీయ జీవితం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఆయనకు గడ్డుకాలం నడుస్తుంది. ఎంతలా అంటే ఆయన వేసిన వ్యూహాలు ఆయనకే ఇబ్బందులు తెస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బాబు వేసిన కొన్ని వ్యూహాలు వల్ల టీడీపీకి. మద్దతు తెలిపిన బీసీ నేతలు పార్టీకి దూరం అయ్యారు. దూరం అయిన బీసీ నేతలు వైసీపీకి చేరువ అయ్యారు. ఇప్పుడు వైసీపీకి దగ్గర అయిన బీసీ నేతలను మళ్ళీ ఆకర్షించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
2019 ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడుని అక్కున చేర్చుకుని, పార్టీ అధ్యక్షుడిని చేసారు. అచ్చెన్నాయుడు బీసీ వెలమ కులానికి చెందిన వ్యక్తి. ఆ తరువాత ఉత్తరాంధ్ర నేతగా ఉన్న కళా వెంకటరావును తెలుగుదేశం అధ్యక్ష పదవి అందించారు. కళా వెంకటరావు బీసీ కాపు కులానికి చెందిన వ్యక్తి. ఉత్తరాంధ్ర బిసి నాయకుడిని ఉత్తరాంధ్ర బిసి నాయకుడితోటే రీప్లేస్ చేసారు. కానీ దానిని ఏదో కొత్తగా ఉత్తరాంధ్ర నేత, బిసి నేత అన్నట్లు కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏంటంటే ఈ నాయకులకు బీసీ నేతలుగా కంటే వెలమ, కాపు కులస్తులుగా ఎక్కువ గుర్తింపు ఉంది.
ఇలా గుర్తింపు ఉండటం వల్ల బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. వెలమ కులానికి చెందిన వ్యక్తిని అధ్యక్ష పదవి నుండి తొలగించి కాపు కులస్థునికి ఇచ్చారని బీసీ నేతలు చర్చించుకుంటున్నారు. బీసీలను ఆకర్షించడానికి బాబు వేసిన వ్యూహం ఇలా బాబుకు ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడికి ఇలాంటి ఎదురు దెబ్బలు 2019 ఎన్నికల తరువాత చాలా తగిలాయి. ఇప్పటికే పతనానికి చేరువలో ఉన్న టీడీపీకి ఇలా ఎదురుదెబ్బలు తగలడం వల్ల పార్టీ మరింత బలహీనపడుతుంది. బీసీల్లో ఏర్పడ్డ వ్యతిరేకతను తొలగించడానికి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇంకెన్ని పథకాలు రచిస్తాడో వేచి చూడాలి.