Chandra Babu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో భాగంగా ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. అయితే రాజకీయాలలో కూడా వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని వాదన ఎప్పటి నుంచో ఉంది అయితే కేవలం రాజకీయాలలో మాత్రమే కాదు ఏ రంగంలోనైనా కూడా వారసత్వం కొనసాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు .ఈ క్రమంలోనే రాజకీయాలలో వచ్చే వారసత్వం గురించి ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.. ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని చంద్రబాబు స్పష్టం చేశారు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని వాటిని అందిపుచ్చుకుంటే ఎవరైనా కూడా రాణించగలరని చంద్రబాబు తెలిపారు. తాను జీవనోపాధి కోసమే రాజకీయాలలోకి రాలేదని తెలిపారు. గత 33 సంవత్సరాల కిందటే నేను కుటుంబ వ్యాపారాలను మొదలు పెట్టానని చంద్రబాబు నాయుడు తెలియచేశారు.
ఇక చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్ సైతం రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నారా లోకేష్ రాజకీయాలలోకి కేవలం ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే వచ్చారని తెలిపారు. లోకేష్ రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ ఎంతో సంతృప్తి పొందుతున్నారని తెలిపారు. లోకేష్ రాజకీయాలలోకి రావడం వెనక ఎలాంటి వారసత్వం లేదని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని… రాజకీయ కక్షసాధింపు చర్యలేవీ ఉండవన్నారు. ఎవరు తప్పు చేసిన చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా వారసత్వం గురించి కక్ష సాధింపు చర్యల గురించి దావోస్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
