వైకాపా సర్కార్ ఏడాది పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఎన్నిసార్లు విమర్శించారో ఎవరికీ తెలియదు. ఎందుకేంటే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు అండ్ కో అదే పనిమీద ఉన్నారు. చంద్రబాబుకు బాకా కొట్టే పచ్చ మీడియా కూడా తోడవ్వడంతో చంద్రబాబు విమర్శలు ప్రజలకు బాగానే చేరాయి. ఏడాది పాలనలో మెనిఫెస్టో లో చెప్పిన్నట్లు 90 శాతం వాగ్ధానాలు ఇప్పటికే నెరవేర్చారు. అవి అమలు కాని వాళ్ల కోసం రచ్చబండ, ప్రజాదర్బార్ అంటూ నేరుగా సీఎం ప్రజల ముందుకే వెళ్లబోతున్నారు. ఇలా జగన్ ఏడాది పాలనపై ప్రజలు సంతోషంగా ఉంటే చంద్ర బాబు అండ్ కో మాత్రం అదే పనిగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.
వీటిలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంపై కూడా చంద్రబాబు నోట బాగుందని అన్న మాట రాలేదు. హైకోర్టులో ప్రభుత్వానికి తగిలిన ఎదురు దెబ్బలను ఎత్తి చూపి మానసిక ఆనందాన్ని పొందారు. ప్రతిపక్షం అంటే కేవలం విమర్శ తప్ప ప్రశంస ఒక్కటీ ఉండదని ఏడాది కాలంలో ఎన్నోసార్లు నిరూపించారు చంద్రబాబు. తాజాగా మరోసారి ప్రభుత్వ పనితీరును ఉద్దేశిస్తూ ఏకంగా ప్రజలకు పెద్ద లేఖే రాసారు. మళ్లీ అదే పాత పాట…ఏడాది పాలనలో జగన్ చేసిందేంటి? రౌడీల రాజ్యం.. ఎందుకు పనికి రాని సంక్షేమ కార్యక్రమాలు..ప్రజా వేదికను కూల్చేసారు.. రాజధానిని ఎందుకు మార్చినట్లు అని ఇలా పాత పాటనే మళ్లీ పాడారు.
అయితే ఇక్కడ చంద్రబాబు ఓ ధైర్యం చేయలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది, ప్రజల కోరకు అమలు పరిచిన సంక్షేమాల గురించి ఎక్కడా ప్ర్రస్థావించలేదు. అలాగే ఉన్నట్లుండి చంద్రబాబు ఈ లేఖ ఇప్పుడు ఎందుకు రాసారు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీ వదిలి వైకాపాలో చేరడానికి సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. నిన్ననే సీనియర్ నేత శిద్దా రాఘవులు వైకాపా కండువా కప్పుకున్నారు. మరోసీనియర్ గల్లా జయదేవ్ కూడా రాజీనామాకి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బహిరంగ లేఖ ప్రజలకు తన స్వరం గట్టిగా వినిపించడానికేనా? అన్న సందేహం కలిగేలా చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డెక్కి మైకు పట్టుకుని మాట్లాడటానికి ఎలాగూ ఛాన్స్ లేదు కదా.