ఏ విషయాన్నైనా రాజకీయం చేయగల సమర్ధత మన రాజకీయ నాయకులకు ఉంది. స్వర్ణా హోటల్ అగ్ని ప్రమాదంలో 10మంది చనిపోతే దాన్ని ఇప్పుడు ఏపీ రాజకీయ నాయకులు కులాలకు, పార్టీలకు అంట గడుతూ దాన్ని కూడా తమ రాజకీయ మైలేజ్ కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
స్వర్ణా హోటల్ ను రమేష్ ఆసుపత్రి యజమాన్యం అద్దెకు తీసుకొని దాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చి అక్కడ వైద్యసేవలు నిర్వహించారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ అగ్ని ప్రమాదం జరగడం వల్ల 10మంది మరణించారు.
ఈ ప్రమాదంలో అధికారులు సరైన అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టని హోటల్ యజమానిని, అనుమతికి మించి భాదితులకు చికిత్స చేస్తున్నప్పుడు పట్టించుకోని అధికారులను ప్రభుత్వ అధికారులు విచారణా చెయ్యాలి. కానీ ఈ ప్రమాదం మొత్తం రాజకీయంగా మారి, కులాల చుట్టూ తిరుగుతుంది. ప్రతిపక్ష నేతలు కూడా ఈ విషయంలో సరిగ్గా స్పందించడం లేదు. కొన్ని రోజుల క్రితం ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ఘటనలో బాధితులను శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు కానీ ఈ ఘటనపై మాత్రం టీడీపీ నేతలు అంతగా స్పందించడం లేదు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలునేతలు, సామాన్య జనం టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు . రమేష్ హాస్పిటల్ అధినేత తమ కులానికి చెందిన వాడు కాబట్టే టీడీపీ నేతలు ఈ ఘటనపై సరిగ్గా స్పందించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు చేసిన ఈ ఒక్క తప్పు వల్ల రాష్ట్రంలో వైసీపీ నేతలు ఎన్ని మాటలు అంటున్న పడాల్సి వస్తుంది. కులాల ప్రాతిపదికన సమస్యలపై స్పందించడం ఏంటని రాజకీయ విశ్లేషకులు కూడా టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు కూడా ఘటనకు సంబంధించిన విషయాలపై విచారణ చేయకుండా అనవసరంగా రచ్చ చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో హీరో రామ్ పోతినేని కూడా హాస్పిటల్ యాజమాన్యం తరపున ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ్ వ్యాఖ్యలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు అడ్డు వస్తే నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరించారు.