AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని ప్రత్యేక బృందం దావోస్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఈ ప్రత్యేక బృందం పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ నారా బ్రాహ్మిని కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సైతం పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా భరత్ మాట్లాడుతూ ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఈయన మాట్లాడారు.
ఈ విధంగా భరత్ లోకేష్ ముఖ్యమంత్రి కావడం గురించి మాట్లాడటంతో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని తెలుస్తుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం… మీరేం మాట్లాడుతున్నారు ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అంటూ మంత్రికి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఏపీలో డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకుంటే మంచిది అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు మీడియా సమావేశాలలో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
ఇలా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ని తొలగించి ఆ పదవి నారా లోకేష్ కి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడటంతో జనసైనికులు జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ కు ఆ పదవి ఇస్తే వెంటనే ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు ఇవ్వాలి అంటూ జన సైనికులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే విదేశాలలో భరత్ నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం గురించి మాట్లాడటంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.