ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గురి మొత్తం బీజేపీ, జనసేనల మీదే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేనట్టే కాబట్టి కమ్యూనిస్టులతో కలవలేరు కాబట్టి బీజేపీ – జనసేన కూటమికి గాలం వేస్తున్నారు. అయితే మొదటి బీజేపీ వైపు నుండి బాబుగారు ప్రయత్నాలు చేయగా అది కుదరలేదు. సోము వీర్రాజు ఇంకొంతమంది ముఖ్య నేతలు చంద్రాబుతో చేతులు కలిపేది లేదని తేల్చిచెప్పేశారు. అసలు టీడీపీని వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్షం కావాలనే ఆలోచనలో ఉంది బీజేపీ. అందుఎక్ చంద్రాబబుగారి కవ్వింపు చర్యలకు మెలికలు తిరగట్లేదు. మెల్లగా ఈ సంగతిని అర్థం చేసుకున్న బాబు ఢిల్లీ వైపు నుండి ట్రై చేశారు. కానీ అక్కడా నిరాశే ఎదురైంది. చంద్రబాబును జాతీయ బీజేపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడ పట్టించుకోలేదు.
అందుకే ఆయన రూట్ మార్చి జనసేన నుండి నరుక్కురావాలని చూస్తున్నారు. పూర్వాశ్రమంలో పవన్ మిత్రుడే కాబట్టి, ప్రస్తుతం అధికార పార్టీ మీద గట్టిగా గకాలం విప్పుతున్నారు కాబట్టి ఆయన్ను పక్కనపెట్టుకుంటే అన్ని విధాలా కలిసొస్తుందనేది చంద్రబాబు ఆలోచన. పవన్ ను గ్రిప్లో పెట్టుకుంటే బీజేపీ కూడ వేరే దారిలేక తనదారికి వస్తుందని అప్పుడు రాష్ట్రంలో బలపడటమే కాదు కేంద్రం నుండి ఎంతో కొంత సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే పవన్ బీజేపీ కంటే మొండివాడు. బీజేపీ అయినా అప్పుడప్పుడు స్పందించి చేతులు కలిపేది లేదని చెప్పేసింది కానీ పవన్ అయితే మాట కూడ మాట్లాడకుండా వెనకే తిప్పుకునే రకం. ఈ సంగతి గత ఎన్నికల సమయంలో వామపక్షాలకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటే అవగతమవుతాయి.
అందుకే పవన్ తో వ్యవహారం గట్టిగా నడపాలి. ఇందుకోసం బాబుగారు వంగవీటి రాధాను ఎంచుకున్నారని టాక్. పరిస్థితులు అనుకూలించక రాధా వైసీపీలో చేరారు కానీ లేకపోతే చంద్రబాబు అంటే ఆయనకు గౌరవమే. దాన్ని బేస్ చేసుకునే పావులు కదుపుతున్నారు బాబు. వైసీపీలో తన పట్ల కనిపిస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక రాధా పక్క చూపులు చూస్తున్నారు. అప్పుడప్పుడు జనసేన స్వరం అందుకుంటున్నారు. పవన్ కు కూడ రాధా మీద సదాభిప్రాయమే ఉంది. అందుకే పవన్ వద్ద రాధాతో రాయబారం పంపాలని ప్లాన్ చేశారట. అందులో భాగంగానే రాధా మొన్నామధ్యన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తో అరగంట పాటు భేటీ అయ్యారని, అందులో టీడీపీతో పొత్తు విషయమే ప్రధాన చర్చ అయిందని విజయవాడ రాజకీయ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి.