మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ప్రస్తుతం పార్టీకి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం ద్వారా తమ పార్టీని నమ్మిన వాళ్ల భవిష్యత్తుకు సైతం ఢోకా లేదని ఎమ్మెల్యేలకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సఫలమయ్యారు.
చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు సంతృప్తితో ఉండటంతో పాటు 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం మరింత కష్టపడతామని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ముందుకెళుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలవరనే ఎమ్మెల్యేలకు కచ్చితంగా టికెట్ ఇవ్వకూడదని జగన్ ఫిక్స్ అయ్యారు. దాదాపుగా సగం మంది ఎమ్మెల్యేలకు భారీ షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు జగన్ వీలైనన్ని అవకాశాలను ఇస్తున్నారు. అప్పటికీ పనితీరు మెరుగుపడని పక్షంలో ఆ ఎమ్మెల్యేలకు ఉద్వాసన తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఒక దారిలో వెళుతుంటే జగన్ మరో దారిలో వెళుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరి దారి కరెక్ట్ అవుతుందో చూడాలి. చంద్రబాబు చేసిన ప్రకటనతో వైసీపీ ఎమ్మెల్యేల నుంచి జగన్ కు ఒత్తిడి మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.
అయితే జగన్ కొన్ని విషయాలలో మొండిగా ముందుకెళతారని రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేల పనితీరును జగన్ మార్చుకోవాలని చెబుతున్నారని అయితే ఆయన పనితీరు మాత్రం మారడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సైతం వాస్తవాలను తెలుసుకుని వ్యవహరించాలని తను మారకుండా ఎన్నికలకు వెళితే మాత్రం షాక్ తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.