ఎక్కడైనా కానీ.. దళితులంటే ఇప్పటికీ చిన్నచూపే. ఎంత ప్రజా ప్రభుత్వం వచ్చినా.. దళితులపై కనికరం ఉండదు. పేరుకే దళితులకు అది చేస్తాం.. ఇది చేస్తాం…అంటారు కానీ..ఏ ప్రభుత్వం వచ్చినా దళితులనే సరికి ఎందుకో వెనుకకు జరుగుతుంది. తమ రాజకీయాల కోసం దళితులు కావాలి.. తమకు ఓట్లు వేయడానికి దళితులు కావాలి.. కానీ..వాళ్ల సమస్యలను పట్టించుకునే నాథుడు మాత్రం ఉండడు. ఇది ఇప్పుడే ఉన్న సమస్య కాదు..దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య.
దళితుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు లేరా? అంటే చాలామంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ.. దళితులపై జరిగే దాడులు ఆగడం లేదు.. దళితుల అభివృద్ధి జరగడం లేదు.
గత ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. చంద్రబాబు దళితులను ఎంత చిన్నచూపు చూశారో ప్రతి ఒక్కరు చూశారు. దానికి ప్రతిఫలంగా ప్రజలు చంద్రబాబును ఘోరంగా ఓడించారు. చర్యకు ప్రతిచర్య అంటే ఇదే. దళితులు ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వాళ్ల ప్రతిభ ఆధారంగా కూడా దేశంలో ఎన్నో పనులు జరుగుతున్నాయి. కానీ.. దళితులంటే మాత్రం ప్రభుత్వాలకు పట్టడం లేదు. అందుకే.. దళితుల పరిస్థితి… అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే ఉంది. ఎవరో చదువుకున్నవాళ్లు తమ కాళ్ల మీ నిలబడి కాస్తో కూస్తో హుందాగా బతుకుతున్నారు కానీ.. చాలామంది పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది.
ఎప్పుడు, ఎక్కడ దళితుల మీద దళితుల పేరుతో దాడులు జరుగుతాయో తెలియడం లేదు. చంద్రబాబు పోయి జగన్ వచ్చినా కూడా అదే పరిస్థితి. ఏం మారలేదు. దాడులు ఆగలేదు. ఇఫ్పటికీ దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు తాను అధికారంలో ఉన్నప్పుడు దళితులను పట్టించుకోని చంద్రబాబు.. ఇఫ్పుడు తానేదో దళితుల అభివృద్ధి ప్రధాత అన్నట్టుగా దళితుల శంఖారావం అంటూ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయినా.. దళితుల మీద చిత్తుశుద్ధి ఉంటే అది మాటల్లో కాదు.. చేతల్లో కనిపించాలి.