జీవితంలో తెలిసి చేసే తప్పులు కొన్నుంటే..తెలియకుండా జరిగిపోయే తప్పులు కొన్నుంటాయి. రెండింటికీ మధ్య చాలా సారూప్యత ఉంది. అది తప్పు అని తెలిసినా మనుగడ కోసం కొన్ని సార్లు చేయక తప్పదు. మనిషి దైనందిక జీవితంలో ఇది సహజం. దీన్నే తెలిసి చేసే తప్పు అంటారు. మరి తెలియక జరిగే తప్పదాలంటే? మన అధీనంలోనూ..అదుపులోని లేకుండా జరిగిపోతుంటాయి. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే? అమరావతి పేరిట ఆయన అలాంటి తప్పిదాలే చేసినట్లు కొన్ని సంఘటనలు అద్ధం పడుతున్నాయి.
జగన్ మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అభివృద్ది వికేంద్రీకరణకు ఏ స్థాయిలో అడ్డుతగులు తున్నారో? నాటి నుంచి నేటి వరకూ అన్నీ చూస్తున్నదే. మూడు రాజధానులను ఎలాగైనా అడ్డుకోవాలని రకరకాల కథలు పడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు చేసిన పనులు కాస్త అతిగానే అనిపించాయన్న వాదన తెరపైకి వస్తోంది. మూడు రాజధానులు వద్దు..ఒకరాజధాని మద్దు..రైతులు నష్టపోతారు అంటూ కొన్ని మాటలు చెప్పినా కొన్ని పనులకి..ఆమాటలకి ఎక్కడో లింక్ తప్పినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు వ్యక్తిగతంగా జోలి పట్టడం..ఎప్పుడు బయటకు రాని ఆయన సతీమణి రైతుల కోసం గాజులు ఇవ్వడం.. తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజధాని కోసం రాజీనామాలు చేస్తారనడం వంటి సన్నివేశాలు కొంత మంది రాజకీయ నిపుణులను ఆలోచనలో పడేసాయి.
ఒక్క అమరావతి అనే రాజధాని కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్ని దూరం చేసుకోవడం చూస్తుంటే? చంద్రబాబు వైఖరి అనుమానించాల్సిందేనని పలువురి అభిప్రాయం. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు అమరావతి వెనుక ఉన్న నిఘూడ రహస్యాల్ని వెలికి తీసి జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా! చంద్రబాబు మాత్రం బెణుకు లేకుండా ఒకే స్టాండ్ పై నిలబడి పోరాటం చేయడం వంటివి చూస్తుంటే బాబు పొలిటికల్ గా కాస్త గాడి తప్పినట్లే కనిపిస్తోంది. ఇదంతా తన అధీనంలో లేకుండా జరిగిపోతుందా? అన్న అనుమానం మరింత బలపడుతోంది. ఇవన్నీ చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ తీసేవే. కేవలం ఒక ప్రాంత అభివృద్ది కోసం రెండు ప్రాంతాల ప్రజల్ని దూరం చేసుకున్నారు. ఇవన్నీ జగన్ కి పొలిటికల్ గా ముందస్తు భవిష్యత్ పాఠాలు లాంటివే. సీఎంగా ఆయన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. వ్యక్తిగత జీవితంలో..రాజకీయ జీవితంలో ఇలాంటి మైలు రాళ్లను ఎన్నింటినో జగన్ కూడా దాటాల్సి ఉంటుంది సుమీ.