చిత్తూరులో మళ్ళీ టీడీపీ జెండాను ఎగరవేయడానికి పక్కా ప్లాన్ ను బాబు సిద్ధం చేశారా!!

Nara Chandra Babu Naidu

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా ఎంత పరాభవం ఎదురైందంటే ఆయన తన సొంత జిల్లా చిత్తూరులో కూడా చంద్రబాబు తప్ప మిగితా నాయకులు ఎవ్వరు గెలవలేదు. ఇంతలా టీడీపీకి చిత్తూరులో వ్యతిరేకత ఎదురైంది. అయితే ఇప్పుడు అక్కడ తిరిగి పట్టును సాధించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పథకం రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ నాయకుల పట్ల వ్యతిరేకత మొదలైందని, దాన్ని వాడుకోవడానికి బాబు సిద్ధమయ్యారని తెలుస్తుంది.

cbn
cbn

వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు

చిత్తూరు జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. అదీ చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలోనే. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే 2014, 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని చంద్రబాబు గుర్తించారు. వీటితో పాటు బలమైన నేతలు అమర్ నాధ్ రెడ్డి, సుగుణమ్మ వంటి వారు ఈసారి ఎన్నికల్లో గెలుస్తారని అంచనా వేస్తున్నారు. నగరిలో రోజా ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆమెపై వ్యతిరేకత మొదలైంది. అలాగే చంద్రగిరిలో రెండు సార్లు విజయం సాధించిన చెవి రెడ్డి భాస్కర రెడ్డి, అలాగే పుంగనూరులో మూడు సార్లు విజయం సాధించిన రామచంద్రారెడ్డిపై కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.

నియోజకవర్గంలోనే ఉంటున్న టీడీపీ నాయకులు

చిత్తూరు జిల్లాలో నగరి, పీలేరు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను చంద్రబాబు అలెర్ట్ చేశారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగా ఉండే వ్యతిరేకతను సానుకూలంగా మలచుకోవాలని సూచించారు. నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై స్పందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొంచెం కష్టపడితే ఇక్కడ సులువుగా గెలుపు సాధించవచ్చని నేతలకు చంద్రబాబు నూరిపోస్తున్నారు. నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. ఈసారి ఎలాగైనా వైసీపీ నేతల హ్యాట్రిక్ విజయాలను ఆపాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు.