AP: పదవుల్లేవు… గిదువుల్లే.. జనసేనకు షాక్ ఇచ్చిన చంద్ర బాబు?

AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ ఇచ్చారు. నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చంద్రబాబు నాయుడు అరెస్టయి జైల్లో ఉన్న సమయంలో నేనున్నానని భరోసా పవన్ కళ్యాణ్ అందరికీ కల్పించారు. ఆ సమయంలోనే బిజెపిని పొత్తుకు ఒప్పించి ఈ మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి.

ఇలా పొత్తు కుదిరినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేస్తున్నారు సీట్ల విషయం నుంచి మొదలుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ విషయంలో కూడా వెనక్కి తగ్గారు అయితే ఇటీవల నామినేటెడ్ పోస్టులలో కూడా జనసేనకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోంది అంటూ జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నామినేటెడ్ పదవుల్లో జనసేనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను భర్తీ చేశారు. కానీ అందులో జనసేనకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో జనసైనికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే పొత్తు ధర్మం అంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అన్ని విషయాలు సర్దుకుని పోతూ కాస్త తగ్గుతూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ విషయంలో, జనసేన నాయకులకు కార్యకర్తలకు అన్యాయమే చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో పదుల సంఖ్యలో టిడిపి తీసుకుని.. ఏకసంఖ్యలో జనసేనకు ఇవ్వడం ఏమిటనేది ఒక ప్రశ్న. ఆది నుంచి రాజీ ఫార్ములాతో ముందుకు వెళ్తుంటే ఇలా చేయడం ఏమిటనేది అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇక ఈ విషయం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై జనసేన సస్పెన్షన్ వేటు వేస్తున్న నేపథ్యంలో జన సైనికులు ఎటు తేల్చుకొని పరిస్థితులలో ఉన్నారు.