ట్విట్టర్లో చినబాబు హడావిడి.. దిగజారుడు రాజకీయాల్ని మాత్రం వదలడం లేదుగా.. ??

Nara Lokesh

 

తెలుగుదేశం ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్ అనే భ్రమలో ఇంకా ఆ పార్టీ కేడర్ ఉందట.. అసలు టీడీపీ భవిష్యత్తే కృష్ణలో కలిసిపోతుంటే నాయకులు మాత్రం ఎడారిలో నీటి చుక్క కోసం వెతుకుతున్నట్లు ఉందంటున్నారు.. అందుకే కావచ్చూ జనం మాత్రం లోకేష్‌లో నాయకుని లక్షణాల కోసం వెతుకుతున్నారు.. బహూశా దీనివల్లే కావచ్చూ చినబాబు ఏం చెప్పినా జనాలకు రీచ్ అవ్వడం లేదు. ఇక 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు, చినబాబులు ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితవుతున్నారు. చివ‌ర‌కు జ‌నాల్లోకి రాకుండా ఇంకా ట్విట్ట‌ర్ పిట్ట అన్న ముద్ర కూడా చేరిపేసు కోలేదు. అదీగాక కరోనా వచ్చిన దగ్గర నుంచి వీరు ఏపీ మొహం చూసింది చాలా తక్కువ.

Is Chandrababu accepts Sri Bharath's wish

ఏదో అప్పుడప్పుడు అతిథిలు మాదిరిగా ఏపీకి వచ్చి వెళ్ళిపోతున్న వీరికి సొంత పార్టీ కార్యకర్తల నుంచే విమర్శలు వస్తున్నాయట. పైగా చినబాబు ఎంతసేపు సోషల్ మీడియాలోనే హడావిడి చేస్తూ తన మేధావి తనాన్ని బైటపెట్టుకునేందుకు ఈ ట్విట్టర్ పిట్ట శత విధాల ప్రయత్నించి విఫలం అవుతుంటాడు, పదిమందిలో పరువు తీసుకుంటాడు.. అయినా గానీ అసలు సిగ్గుపడడట.. ఇక ఆమధ్య సీఎం జగన్ మాస్క్ లేకుండా బైటకెందుకు వెళ్తున్నారంటూ ట్వీట్ చేసి ఏదో స్కామ్ ని వెలికితీసినట్టు బిల్డప్ ఇచ్చిన ఈ బాల మేధావి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలకు సీయం ఎందుకు బైటకు రావడం లేదంటూ లాజిక్ తీశారు..

కానీ వైఎస్ జగన్ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి 3648 కిలోమీటర్ల దూరం కాలినడకన పాదయాత్ర చేసిన సంగతి మరచినట్టు ఉన్నాడు.. అంతే కాకుండా పాదయాత్ర సమయంలో వర్షంలో తడిచారు, బురదలో అడుగేశారు, వరిచేలో దిగారు అలాంటి వైఎస్ జగన్ ని ఎండకు కందిపోయే ఈ లోకేష్ ప్రశ్నించడం వింత, విడ్డూరంగా పరువుతీసుకోవడానికి కాకపోతే మరేంటని వైసీపీ వర్గీయులు నవ్వుతున్నారట.. ఇలా ఏపీ సీయం ఏ మంచిపని చేసిన అందులో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నాయకులు అమరావతి రైతుల మరణాలనే కాదు.. చివరకు ప్రకృతి విపత్తుల్ని కూడా నీఛ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని అనుకుంటున్నారట ప్రజలు..

ఇక వీరి తప్పుడు రాజకీయాన్ని తూర్పార పట్టిన రైతుబిడ్డ చీవాట్లు పెట్టి ఇంకా రెండు రోజులైనా కాలేదు.. మళ్లీ ట్విట్టర్లో చినబాబు హడావిడి ఎక్కువైందంటున్నారు.. అదీగాకుండా సోషల్ మీడియాలో ఎంతమంది దుమ్మెత్తిపోస్తున్నా, వెకిలి కామెంట్స్ చేస్తున్నా తన దిగజారుడు రాజకీయాల్ని మాత్రం ఈ బాల మేధావి కూడా వదలడం లేదని నవ్వుకుంటున్నారట ప్రజలు.. అయ్యా లోకేశా ఎందుకయ్యా నీకు కలిసి రాని రాజకీయాల్లో అనవసరంగా వేలు పెట్టి తిట్టించుకుంటావు అనే వారు కూడా లేకపోలేదు..