నందమూరి ఫ్యామిలీని వాడేస్తున్న బాబు.. అప్పుడు అన్న ఇప్పుడు తమ్ముడు

chandra babu balakrishna

 టీడీపీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఇందులో కీలకమైన పొలిట్ బ్యూరో కమిటీని కూడా నియమించాడు. గతంలో పదహారు మంది సభ్యులు కలిగిన ఇందులో ఇప్పుడు ఏకంగా 22 మందిని సభ్యులుగా నియమించాడు. ఈ కమిటీలో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కు కూడా స్థానం కల్పించాడు. మొన్నటిదాకా ఒక్క ఎమ్మెల్యే పదవి తప్ప బాలకృష్ణ కు పార్టీ పరంగా ఎలాంటి పదవులు లేవు. ఇప్పుడు కొత్తగా పొలిట్ బ్యూరో పదవి కట్టబెట్టాడు బాబు.

balakrishna telugu rajyam

గతంలో ఇదే పదవి టీడీపీ సీనియర్ నేత దివంగత హరికృష్ణ కు ఇచ్చాడు బాబు. మధ్యలో వచ్చిన చిన్న చిన్న విభేదాలు వలన హరికృష్ణ ను పొలిట్ బ్యూరో పదవి నుండి తప్పించాడు. అయితే 2009 లోనందమూరి ఫ్యామిలీ అవసరం టీడీపీకి కావాల్సి రావటంతో హరికృష్ణ కు పార్టీలో మరోసారి గౌరవం ఇస్తూ, పొలిట్ బ్యూరో పదవి మరియు రాజ్యసభ సభ్యుడిని చేసాడు బాబు. ఇక్కడ కూడా బాబు తన కుటిల రాజకీయాలను ప్రయోగించి రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే విధంగా ప్రలోభపెట్టి, కేవలం హరికృష్ణ ఒక్కడి రాజీనామానే స్పీకర్ తో ఆమోదముద్ర వేయించి, కేవలం పార్టీ పరంగా పొలిట్ బ్యూరో పదవి మాత్రమే ఉంచాడు. 

హరికృష్ణ చనిపోయే వరకు పొలిట్ బ్యూరో సభ్యుడిగానే ఉన్నారు. ఆయన మరణంతో ఖాళీగా ఉన్న ఆ పదవి కళ్యాణ్ రామ్ కు లేదా..? బాలయ్య బాబుకు ఇస్తారనే మాటలు వినవచ్చాయి. తాజాగా చంద్రబాబు ఆ స్థానాన్ని బాలకృష్ణ కు కట్టబెట్టాడు. దీనితో పార్టీ పరంగా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాలు అభిమానుల్లోకి పంపించాడు బాబు. అటు తెలంగాణలో కూడా హరికృష్ణ కూతురు సుహాసిని కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాడు. ఎన్టీఆర్ నుండి అధికారం తీసుకున్న చంద్రబాబు ఆ తర్వాత మెల్లగా మెల్లగా నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టాడు. 2004 లో తనకు అధికారం దూరమైనా తర్వాత 2009 ఎన్నికల సమయం నాటికీ వాళ్ళని దగ్గరకు తీసుకున్నాడు

cbn and nandamuri family telugu rajyam

 

  ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క బాలకృష్ణ కు మాత్రమే ఎమ్మెల్యే పదవి తప్ప ఇంకేమి లేదు. టీడీపీ అధికారంలో ఉన్నకాలంలో హరికృష్ణ బ్రతికున్న కానీ ఏ పదవి ఇవ్వలేదు. తన కొడుకు లోకేష్ ను దొడ్డిదారిన మంత్రిని చేసుకొని ఆ సాకుతో బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదు. 2018 ఎన్నికల్లో సుహాసిని ఓడిపోతుందని తెలిసిన, ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెను కూకట్ పల్లి నుండి పోటీకి దించాడు బాబు.. హరికృష్ణ కూతురిని పోటీకి దించి అన్యాయం చేశాడంటూ అప్పటిలో కేసీఆర్ కూడా విమర్శలు చేశాడు. ఇక ఇప్పుడు అధికారం లేదు కాబట్టి పార్టీ పరంగా ఆంధ్రాలో ఒక పదవి, తెలంగాణాలో మరో పదవి నందమూరి వంశానికి ఇచ్చాడు. మళ్ళీ అధికారం వస్తే యధావిధిగా వాళ్ళని పక్కన పెట్టేస్తాడని బాబు నైజం తెలిసిన రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు..