భార్యాభర్తల మధ్య అన్యోన్యత పదికాలాలపాటు మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అయితే భార్యాభర్తలు తెలిసి తేలిక చేసిన కొన్ని పనుల వల్ల వారి మధ్య ఉన్నటువంటి బంధం బీటలు పారుతుంది.అయితే భార్య భర్తల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా ఉండాలంటే వారు కొన్ని విషయాలలో ఏమాత్రం తప్పులు చేయకూడదని ఆచార్య చానిక్యుడు తెలియజేశారు. మరి ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయానికి వస్తే…
భార్యాభర్తలు సంపాదన విషయంలో ఎప్పుడూ కూడా నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అనే గొడవలు పడకూడదు.ఇలా భర్త కన్నా భార్య ఎక్కువగా సంపాదించిన లేదా భార్య భర్త సంపాదనను ప్రశ్నించిన గొడవలు మొదలవుతాయని తెలిపారు.ఇక భార్య భర్తలు ఏ పని చేస్తున్న ఒకరి పనిని మరొకరు గౌరవించుకోవాలి ఇలా గౌరవించుకున్నప్పుడే ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండవని తెలిపారు.
ఇక భార్యాభర్తలు ఖర్చు చేసే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఇద్దరు కూడా ఇష్టానుసారంగా ఖర్చులు చేయకుండా ఉండాలి అలాగే కోపం విషయంలో భార్యాభర్తలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి భార్యాభర్తల బంధాన్ని ముగింపు దశకు తీసుకు వెళ్ళేది కోపం మాత్రమే. ఎప్పుడైతే కోపాన్ని అణిచివేసుకోలేము ఆ క్షణం మన బంధం తెగిపోతుందని అందుకే ప్రతి క్షణం మన కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడటం సరైన వ్యక్తుల లక్షణమని ఆచార్య చానిక్యుడు తెలియజేశారు.