బొమ్మ అదిరింది షోలో జానీ మాస్టర్ ఎలా రచ్చ చేస్తాడో అందరికీ తెలిసిందే. డ్యాన్సులు వేయడంలోనే కాదు.. పంచులు వేయడంలోనూ జానీ మాస్టర్ తన ప్రత్యకేతను చాటుకుంటాడు. డ్యాన్సర్ పండు, శ్రీముఖిలపై జానీ మాస్టర్ ఎలా సెటైర్లు వేస్తారో.. టీం లీడర్లు తమ స్కిట్స్‌లో జానీ మాస్టర్‌పై అంతకు మించి సెటైర్లు వేస్తారు. అయితే ఇలా యాంకర్లను, జడ్జ్‌లను స్కిట్లలో వాడుకోవడం కొత్తేమీ కాదు.
చమ్మక్ చంద్ర స్కిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ నుంచి అదిరిందికి వచ్చాడు. కానీ తన ఫార్మూలాను మాత్రం మార్చలేదు. అక్కడ ఎలాంటి స్కిట్లు వేశాడు ఇక్కడ కూడా అలాంటివే వేస్తున్నాడు. పక్కింటి సంగతులు, అక్రమ సంబంధాలు అంటూ వాటి చుట్టే తిరుగుతుంటాయి. తాజాగా అలాంటి స్కిట్‌తోనే మళ్లీ ముందుకు వచ్చాడు. కాకపోతే ఈ సారి జానీ మాస్టర్‌ను మధ్యలోకి లాగాడు.
చంద్ర స్కిట్‌లో సత్య అనే అమ్మాయి ఉంటుందన్న సంగతి తెలిసిందే. స్కిట్‌లో భాగంగా చంద్ర తన భార్యను అనుమానిస్తాడు. తన పిల్లాడు జానీ జానీ ఎస్ పాప అనే పద్యాన్ని చదువుతుంటాడు. అందులో జానీ జానీ అంటూ పలుకుతుంటాడు. ఇలా పిల్లాడు కలవరించడంపై భార్యను చంద్ర అనుమానిస్తాడు. జానీ మాస్టర్ చాలా మంచి వాడు.. ఈ పిల్లాడు కచ్చితంగా నీకు పుట్టిన వాడే అంటూ చమ్మక్ చంద్రకు సర్ది చెబుతుంది. ప్రతీ సారి ఇలానే రిపీట్ అవుతుంది. మొత్తానికి జానీ మాస్టర్‌ను కూడా తమ స్కిట్‌లోకి పరువుతీస్తున్నారు.