కొమరం భీమ్ మూడో పాటను తాగుబోతు పాటగా చూపించిన చలాకి చంటి.. ఫైరవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన కొమరం భీముడో పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఎమోషన్స్ ను కనబరుస్తూ,ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఈ పాటలో ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ నటన పై ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు కురిపించారు.

సినిమా కథ మొత్తం కీలకంగా మలుపుతిప్పే ఈ పాటను చలాకి చంటి జబర్దస్త్ కార్యక్రమంలో చేసి చూపించారు. అయితే ఈ పాటకు బదులుగా ఈ పాటను తాగుబోతు పాటగా చిత్రీకరించి చలాకి చంటి స్కిట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సందర్భంగా చలాకి చంటి ఈ పాటను పాడుతూ…విస్కీదేవాలా బ్రాండీ దేవాలా.. గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట ప‌క్క‌నా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్క‌కీ ముక్క ముక్క‌తో జుర్రుకోవాలా.. దొబ్బితాగాలా అంటూ తాగుబోతుల పాటగా చిత్రీకరించారు.

YouTube video player

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు ఈ పాట పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా ఎంతో స్ఫూర్తిదాయకంగా పాడిన ఈ పాటను ఇలా తాగుబోతుల పాటగా చిత్రీకరించడం ఏంటి? ఎన్టీఆర్ పాటను ఇలా అవమానపరచడం ఏంటి అంటూ పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు చలాకి చంటి స్కిట్ పై ఆయన క్రియేట్ చేసిన ఈ తాగుబోతు పాట తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.