Samantha: చైతన్యతో విడాకుల తర్వాత ఆ సమస్యలు ఎదుర్కొన్నా..సమంత ఎమోషనల్ కామెంట్స్..!

Samantha: ఏమాయ చేసావే సినిమాతో పరిచయం అయిన సమంత.. నాగచైతన్యను మాయ చేసింది. ఇద్దరు ప్రేమించి, పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించాకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇటీవల విడాకులతో తమ బంధానికి ముగింపు పలికారు. ఏమైందో తెలియదు కానీ.. వీరిద్దరు మనస్పర్థలతో విడిపోయినట్లు తెలుస్తోంది. నాగచైతన్య- సమంత విడాకుల వ్యవహారం అందర్ని ఆశ్యర్యానికి గురిచేసింది. ఇటు అక్కినేని ఫ్యాన్స్, సమంత అభిమానులు కూడా ఈవిషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.

విడాకుల తర్వాత సమంత చాలా డిస్ట్రబ్ అయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ బాధను తెలియజేస్తూ.. పలుసార్లు ఎమోషనల్ పోస్టులను కూడా పెట్టింది. ఒకానొక సమయంలో తాను చనిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ప్రస్తుతం సమంత మళ్లీ నార్మల్ స్థితికి చేరకుంది. వరసపెట్టి సినిమాలు కూడా చేస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ‘ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’ అనే పాట పెద్ద హిట్ అయింది. దీంతో పాటు గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే ప్యాన్ ఇండియా సినిమాతో పాటు, తెలుగు, తమిళ్ భాషల్లో యశోధ సినిమాను చేస్తోంది.

ఇదిలా ఉంటే సమంత ఇటీవల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవితం ఎవరికి అద్భుతంగా ఉండదని… తన జీవితంలో కూడా ఎన్నొరకాల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సినీ నటి సమంత చెప్పారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, వైద్యుల సాయం తీసుకోవాలని సూచించారు. మానసికి సమస్యలు వచ్చినప్పుడు నేను ధైర్యంగా నిలబడేందుకు ఎందరో సహాయం చేశారని సమంత అన్నారు. నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్లు ఎంతో ధైర్యాన్ని అందించారని వెల్లడించింది. ఇటీవల రోష్ని ట్రస్ట్‌ ‘సైకియాట్రి ఎట్‌ డోర్‌ స్టెప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభ కార్యక్రమంలో సమంత ఈ వ్యాఖ్యలు చేసింది.