Chadalavada Srinivasarao: విజయ్ కనిష్క, గరిమ చౌహన్ జంటగా నటించిన తాజా చిత్రం కలవరం. సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో హనుమాన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..
ఈ కథ నాకు ముందే తెలుసు. బాల చందర్, భాగ్య రాజా లాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఇది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఇప్పటి దాకా చిన్న సినిమాలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలైనా చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలి. చిన్న సినిమాలకి షోలు ఎక్కువ ఇవ్వాలి. మినీ థియేటర్లు కట్టాలి అని ఆయన అన్నారు. దీంతో ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వాఖ్యలపై కొంతమంది నెగటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
కాగా ఈ సినిమా డైరెక్టర్ హనుమాన్ వాసం శెట్టి మాట్లాడుతూ.. ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి ఈ సినిమా చేస్తున్నాము అని నిర్మాత శోభా రాణి చెప్పారు. వెంటనే చెన్నై వెళ్లి హీరోకి కథ చెప్పగానే ఓకే చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అని తెలిపారు. కాగా తాజాగా ఈ సినిమా మొదలైన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.