AP: వైయస్ జగన్మోహన్ రెడ్డికి కడప కంచుకోట అనే విషయం మనకు తెలిసిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ వైయస్ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఇలా జగన్ కంచుకోట అయినటువంటి కడపను కూడా బద్దలు కొట్టడం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేసారని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఏ జిల్లాలలో అయితే తమ పార్టీ వీక్ గా ఉందో ఆయా జిల్లాలలో పెద్ద ఎత్తున పార్టీలు సభలను నిర్వహిస్తూ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కడపలో తమకు అనుకూలంగా ఉందని చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికలలో ఏకంగా ఏడు స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి కడపను కూడా పూర్తిగా తన కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఎప్పుడైతే శత్రువు స్థానంలో విజయం సొంతం చేసుకుంటారో అప్పుడే సంపూర్ణ విజయం దక్కినట్టుని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నిర్వహించే అతిపెద్ద సభ అయినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు అండ్ టీం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాట్ల చేస్తారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించబోతున్నారని సమాచారం. ఇలా కడపలో పెద్ద ఎత్తున సభలు సమావేశాలను నిర్వహిస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీ బలం పుంచుకోవడానికి చంద్రబాబు ప్లాన్స్ వేస్తున్నారు మరి కడపలో నిర్వహించబోయే మహానాడు కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.