2019 ఎన్నికల నుండి టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వైసీపీని దెబ్బకొట్టడానికి టీడీపీ ఎదురు చూస్తుంది కానీ వైసీపీ దొరకడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాకపోయినా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామని టీపీడీ నేతలు అనుకున్నారు కానీ ఇక్కడ కూడా డిలా పడ్డారు. అయితే ఇదే పరిస్థితి ఇంకా కొన్ని రోజులు కొనసాగితే వచ్చే ఎన్నికల సమయానికి టీడీపీకి పోటీలో నిలబడటానికి కూడా అభ్యర్థులు దొరకరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా ఎంపీలు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికి తెలియదు.
ఓడినా వారు ఎక్కడ ఉన్నారో!!
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీ పోటీ చేసి ఓడినా నాయకులు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికి తెలియడం లేదు. వారిలో చాలా మంది ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. మిగితా నాయకులు ఇళ్లకే పరిమితం అయ్యారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున పోటీ చేసిన వారిలో డీకే సత్యప్రభ (రాజంపేట), శివప్రసాద్ ( చిత్తూరు) మృతిచెందారు. అనకాపల్లిలో పోటీ చేసిన అడారి ఆనంద్‌కుమార్, నెల్లూరులో పోటీ చేసిన బీద మస్తార్‌రావు, ఒంగోలులో పోటీ చేసిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. కడపలో ఆదినారాయణ రెడ్డి కాషాయం కండువా కప్పుకున్నారు. నరసారావుపేటలో రాయపాటి సాంబశివరావు, అరకులో వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టే. ఇలా ఎన్నికల్లో ఓడిన నేతలు టీడీపీకి దూరంగా ఉన్నారు.
అభ్యర్థులు దొరుకుతారా!!
2019 ఎన్నికల్లో ఓడినా కూడా ఇప్పటికే కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే టీడీపీ తరపున అక్టీవ్ గా ఉన్నారు. అనంతపురం పార్లమెంటరీ ఇన్‌చార్జ్ జేసీ పవన్ కుమార్ రెడ్డి, ఇటు హిందూపురంలో ఓడిన నిమ్మల కిష్టప్ప ఉన్నంతలో బెటర్. వీరిలో పవన్ కుమార్ రెడ్డి దూకుడు రాజకీయాలతో వార్తల్లో ఉంటున్నారు. ఈ పై లెక్కలు చూస్తే లోక్‌సభ అభ్యర్థుల్లో తెలుగుదేశంలో ఎంత మంది యాక్టివ్‌గా ఉన్నారో తెలుస్తోంది. బాబుకు ఈ సారి ఖచ్చితంగా ఎంపీ క్యాండెట్లను సెట్ చేసే సరికి తల ప్రాణం తోకమీదకు రావడం ఖాయం. వచ్చే ఎన్నికల సమయానికి బాబు వైసీపీ ఎలాంటి మ్యాజిక్ చేసి గెలుపుకు బాట వేస్తారో చూడాలి.