ఒక వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు అతని నేపథ్యం ఏమిటో చూడాలి అంటారు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, అతని మీద కేసులు ఏమైనా ఉన్నాయా, అతని క్రిమినల్ రికార్డ్స్ ఏంటి అనే అంశాలను ఎంక్వైరీ చేయాలి. అప్పుడే రాజకీయాల్లో అవినీతిపరుల సంఖ్య తగ్గుతుంది. కానీ రాజకీయ పార్టీలు ఆ పని చేస్తున్నాయా అంటే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే ఈమధ్య సుప్రీం కోర్టు నేతల మీదున్న అవినీతి ఆరోపణలను త్వరితగతిన విచారణ చేసి తీర్పు వెలువరించేలా కార్యాచరణను రూపొందిస్తోంది. కొందరు వ్యక్తులు పదవుల్లో లేనప్పుడు తప్పులు చేస్తారు. తీరా వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ తప్పుల తాలూకు కేసులు బయటికొస్తాయి. దీంతో అతను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీకి తలవంపులు తప్పవు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితే వైసీపీకి ఎదురైంది. ఆ పార్టీకి చెందిన నేత, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మీద ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోడైంది. ద్వారకాతిరుమల మండలం మాలసానికుంట గ్రామానికి చెందిన గురజాల ఆదిలక్ష్మి అనే మహిళ డిసెంబర్ 2017లో తన ఇంటిపై తలారి వెంకట్రావు దాడి చేశారని పిర్యాధు చేశారు. కానీ వెంకట్రావు మీద కేసు నమోదు కాలేదు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు.
పిర్యాధు చేసిన సదరు మాహిళ వెంకట్రావు మీద చర్యలు తీసుకలేదని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వెంకట్రావు మీద కేసు నమోదు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో వైసీపీ తరపున తలారి వెంకట్రావు ఎమ్మెల్యేగా పోటీచేసి ఒడిపోయారు. ఆ తర్వాత ఆయన బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. 2019 ఎమ్మెల్యే అయ్యాక ఆ కేసు బయటికొచ్చింది. అందరూ వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం, వైసీపీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు అంటున్నారు. మొత్తం మీద వె వెంకట్రావు మీద హైకోర్టు కేసు నమోదుచేయమని ఆదేశించడం జగన్ ప్రభుత్వానికి తలవంపులని అంటున్నారు.
(గమనిక : ఈ ఆర్టికల్ నందు ప్రస్తావించబడిన విషయం మా సొంత అభిప్రాయం కాదు. ఈ కింది సోర్స్ నుండి తీసుకుని తెలియపరుస్తున్నదే.)
Source:
https://m.tupaki.com/article/High-court-orders-case-against-YCP-MLA/260241