YS Jagan: వైయస్ జగన్ కి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం… ఏకంగా తొమ్మిది సెక్షన్లపై కేసు నమోదు!

YS Jagan: మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై తొమ్మిది సెక్షన్ల కింద ఎన్నికల సంఘం కేసులు నమోదు చేశారు..గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఎన్నికల అధికారి సిహెచ్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇలా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల కోడ్ ఉల్లంగించి ఇటీవల గుంటూరు మిర్చి యాడ్ వద్దకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలివచ్చారు.

ఇలా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జగన్ పర్యటించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉన్న వైకాపా నేతలు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల రెడ్డి లపై కేసు నమోదు అయింది.

ఆయన పర్యటన కారణంగా మిర్చి యార్డు ముందు భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇక మిర్చి యార్డులో వైసీపీ నేతల హంగామా వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు.

ఇలా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గుంటూరు పర్యటనకు రావడంతో ఆయన పై 9 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. మరి వైసీపీ నేతల పై పెట్టిన ఈ కేసుల పట్ల వైకాపా నాయకులు ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.