Vani Vishwanath : వాణి విశ్వనాధ్ ముదురు మాటలు: రోజాకి ఎదురెళ్లే దమ్ముందా.?

Vani Vishwanath : వాణీ విశ్వనాధ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఆ తరం హీరోల సరసన అప్పట్లో బాగానే ఆడి పాడిందనుకోండి. అయితే, పెద్దగా స్టార్‌డమ్ తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడెందుకీ సీనియర్ భామ ముచ్చటంటారా.? వుంది అసలు విషయం వేరే వుంది.

సీనియర్ స్టార్ హీరోయిన్‌గా సిల్వర్ స్ర్కీన్‌పై సత్తా చాటిన ముద్దుగుమ్మ రోజాతో వాణీ విశ్వనాధ్ సై అంటే సై అంటూ కాలు దువ్వుతోంది. వెండితెరపై ప్రస్తుతం సీనూ, సినిమా లేని వీరిద్దరికీ సవాల్ విసురుకునేంత అవసరం ఇప్పుడేం వచ్చిందంటారా.? మనం మాట్లాడుకునే ఇంట్రెస్టింగ్ ఇష్యూ పాలిటిక్స్ గురించి.

అవునండీ, అప్పట్లో సిల్వర్ స్ర్కీన్ మీద సత్తా చాటిన రోజా ఇప్పుడు పాలిటిక్స్‌లోనూ తనదైన స్లయిల్లో ఎమ్మెల్యే స్థానంలో ఫైర్ బ్రాండ్‌ అనిపించుకోబడట్లా. నగరి ఎమ్యెల్యేగా ఒక్కసారి కాదు, రెండు సార్లు గెలిచిన హిస్టరీ వుంది రోజాకి. అలాంటి రోజాని వాణీ విశ్వనాధ్ సవాల్ చేస్తోంది మరి.

స్టన్నింగ్ ఇష్యూనే కదా. సినీ కెరీర్ పరంగా చూసినా రోజాతో పోటీ కాదు వాణీ విశ్వనాధ్. అలాగే, పాలిటిక్స్‌లోనూ అంత సీను లేదు వాణీ విశ్వనాధ్‌కి. అప్పుడెప్పుడో 2019 ఎలక్షన్స్ టైమ్‌లో ధూం ధాం అంటూ మీడియా ముందుకొచ్చి నాలుగు పంచు డైలాగులేసి మాయమైపోయింది వాణీ విశ్వనాధ్.

ఇప్పుడు మళ్లీ పొలిటికల్ తెరపైకొచ్చింది అదే స్పీడుతో. ఈ సారి ఏకంగా రోజా పైనే పోటీకి దిగుతానంటోంది. అదీ రోజాకి సొంత నియోజక వర్గం, ఆయువు పట్టయిన నగిరిలో. ఈ సారి ఎలక్షన్స్‌లో నగిరి నుంచి పోటీ చేస్తాననీ చెబుతోంది వాణీ విశ్వనాధ్.

ఇంతకీ అంత కాన్ఫిడెంటుగా నగిరి నుంచే వాణీ విశ్వనాధ్ పోటీ చేస్తానని చెప్పడానికి కారణమేంటబ్బా.? అనుకుంటున్నరా.? వాణీ విశ్వనాధ్‌ అమ్మమ్మకీ, నగిరి సంస్థానానికీ బీరకాయ పీచు అనుబంధమేదో ఉందట. అదీ.. అద్గదీ సంగతి.