Devotional: మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం కొన్ని వృక్షాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలా పవిత్రంగా భావించే వాటిలో బిల్వ వృక్షం ఒకటి. బిల్వ వృక్షానికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బిల్వదళాలతో పరమేశ్వరుడికి పూజ చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. అయితే చాలామందికి బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది.
పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఈ బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు ఉండవని, ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన ఈ వృక్షాన్ని ఇంటి ఆవరణంలో పెంచుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. మూడు ఆకులతో కలిగి ఉండే ఈ బిల్వ పత్రాలు శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తినీ సూచిస్తాయి.ఎంతో పవిత్రమైన ఈ పత్రాలతో పరమేశ్వరుడికి అర్చన చేయడం వలన సకల దోషాలు తొలగిపోవడమే కాకుండా వేలాది మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
బిల్వ దళాలతో శివునికి అర్చన చేయటం వల్ల 108 శివాలయాలను దర్శించిన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా బిల్వార్చనతో మోక్షం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన ఈ బిల్వ వృక్షము ఇంటిలో ఉండటం వల్ల సకల సంపదలు వృద్ధి చెందుతాయి కనుక ఇంతటి పవిత్రమైన వృక్షాన్ని ఇంటి ఆవరణంలో పెంచుకోవడానికి ఏ విధమైనటువంటి సంకోచం వ్యక్తం చేయాల్సిన పనిలేదని నిస్సంకోచంగా ఈ వృక్షాన్ని పెంచుకోవచ్చని పండితులు చెబుతున్నారు.