ఎమ్మెల్యే అవ్వాలన్న ఆ నాయకుడి కోరికను చంద్రబాబు నెరవేరుస్తాడా!!

tollywood hero to campaign in ghmc elections for tdp

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పతనావస్థకు చాలా చేరువలో ఉంది. వైసీపీ ధాటికి అన్నగారు స్థాపించిన పార్టీ యొక్క పునాదులు పూర్తిగా ధ్వసం అయ్యాయి. ఇలాంటి సమయంలో టీడీపీలోనే ఉంటే తమకు లాభం లేదన్న చాలామంది నేతలు టీడీపీని వీడి వైసీపీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు, ఇప్పటికే చాలామంది వేరే పార్టీలోకి వెళ్లారు కూడా. కానీ కొంతమంది నాయకులు మాత్రం పార్టీని నమ్ముకొని, చంద్రబాబు నాయుడిపై విశ్వాసంతో పార్టీలోనే ఉన్న అతికొద్ది మంది నాయకుల్లో ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరావు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వన్నప్పటికి పార్టీని మాత్రం విడకుండా పార్టీ కోసం పని చేస్తున్నారు.

ఎమ్మెల్యే అవ్వాలన్న కోరికను బాబు నెరవేరుస్తాడా!!

విశాఖ జిల్లాలో తెలుగుదేశం రాజకీయాలను బుద్ధా ముందుండి నడిపిస్తున్నారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులకు దీటుగా సమాధానం ఇస్తూ పార్టీ యొక్క ఉనికిని గట్టిగా చాటుతున్నారు. ఒకప్పుడు విశాఖలో టీడీపీ రాజకీయాలను మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నడిపించేవాడు. ఆయన వైసీపీలోకి వ్వెళ్లిన తరువాత బుద్ధానే పార్టీని నడిపిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో అనకాపల్లి పట్టణ ప్రెసిడెంట్ గా ఆయన పార్టీకి విశేష సేవలు అందించారు. దాంతో ఎమ్మెల్యే అవాలనుకున్నారు. అయితే కొన్ని రాజకీయ సమీకరణ నేపధ్యంలో పీలా గోవిందుకు చంద్రబాబుఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆయన గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు 2022తో ఆయన ఎమ్మెల్సీ పదవి ముగియనుంది. దీంతో ఆయన 2024లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యలనుకుంటున్నారు. ఈ కోరికను మరి బాబు నెరవేస్తాడో లేక మళ్ళీ వేరే నాయకుడికి ఇస్తారో వేచి చూడాలి.

మళ్ళీ పిలా గోవింద్ కు ఇస్తాడా!!

2019 ఎన్నికల్లో పిలా గోవింద్ వైసీపీ ధాటికి నిలబడలేకపోయారు. ఓడిపోయినా తరువాత పెద్దగా పార్టీ కార్యకలపాలలో పాల్గొనటం లేదు. కానీ 2024లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడానికి సిద్ధమవుతున్నాడని, ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం. ఒకవేళ మళ్ళీ పిలా గోవింద్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం బుద్ధా ఎమ్మెల్యే ఆశలు గంగలో కలిసిపోతాయి.