విశాఖ‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం..వ‌దంత‌లు న‌మ్మొద్దు

విశాఖ‌లో ఎల్ జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీక్ ఘ‌ట‌న త‌ర్వాత ఆ మ‌రుస‌టి రోజు మ‌ళ్లీ గ్యాస్ లీక‌వుతుంద‌ని భ‌యంతో ప్ర‌జ‌లు పరుగులు తీసిన మాట వాస్త‌వం. అయితే ఇప్ప‌టికీ ఇదే వాతావ‌ర‌ణం అక్క‌డ ఉందని..గ్రామ‌స్తులు ఇంకా ఆందోళ‌న చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ ప్ర‌చారాన్ని టీవీడీ నేతలు, ఫాలోవ‌ర్స్ ప‌నిగ‌ట్టుకుని చేస్తున్నారు. విశాఖ‌ని ఎలాగైనా ఎగ్జిక్యుటివ్ క్యాపిట‌ల్ నుంచి త‌ప్పించాల‌ని ప‌చ్చ మీడియా స‌హా టీడీపీ ఆందోళ‌న‌కారులు చేస్తోన్న విష ప్ర‌చార‌మిది. ప్ర‌స్తుతం విశాఖ‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉంది. అక్క‌డ ఎలాంటి ఆందోళ‌నలు జ‌ర‌గ‌లేదు.

గ్యాస్ ప్ర‌భావిత గ్రామాల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించి అక్క‌డే అన్ని ర‌కాల స‌దుపాయాలు చేసి ప్ర‌భుత్వం చూసుకుంటోంది. తాజాగా ఈఘ‌ట‌న‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది అదంతా విష ప్ర‌చారం…టీడీపీ నేత‌లు ఫాలోవ‌ర్స్ కావాల‌ని చేస్తోన్న ప‌ని అది. ప్ర‌స్తుతం ఇక్క‌డ ప్ర‌శాంత వాతావ‌ర‌ణ ఉంది. క‌మీటీ సూచ‌న‌ల మేర‌కు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్నాం. ప‌రిస్థితిలు ఇప్పుడు పూర్తిగా అదుపులో ఉన్నాయి. మొత్తం ఐదు గ్రామాల‌ను శుభ్ర ప‌రుస్తున్నాం. ఈవాళ సాయ‌త్రం 4 గ‌ట‌ల త‌ర్వాత స్థానికుల‌ను ఆయా గ్రామాల‌కు త‌ర‌లిస్తాం. ఈ రాత్రికి భోజ‌నాలు కూడా ప్ర‌భుత్వ‌మే చూస్తుంది.

మంగ‌ళ‌వారం నుంచి వాలంటీరి ఇంటికొచ్చి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌రిహారం అంద‌జేస్తారు. ఆ త‌ర్వాత మెడిక‌ల్ క్యాంపుల ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని మంత్రి తెలిపారు. అలాగే తొలుత కేజీహెచ్ లో చిన్నారి గ్రీష్మ త‌ల్లికి కోటి రూపాయ‌ల చెక్కును అందించ‌డం జ‌రిగిందని తెలిపారు. ఈ రాత్రికి ప‌లువురు మంత్రులు అక్క‌డే బ‌స చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఏర్పాట్ల‌ల‌లో ఏమైనా లోపాలు ఉంటే వెంట‌నే చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నంలో భాగంగా నేరుగా మంత్రులే రంగంలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.