Big Boss 6 : బిగ్ బాస్ సీజన్ 6 లో ఛాన్స్ కొట్టేసిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి.. దీనిలో నిజమెంత..?

Big Boss6: ఓటిటీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటినుండి నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే వారి కోసం సంప్రదింపులు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీజన్ లో టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఐదు మందిని తర్వాత సీజన్లో తీసుకొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకారం శివ, మిత్ర , అనిల్, బాబా భాస్కర్, బిందు, అఖిల్, అరియానాలలో ఎవరో ఒకరు టైటిల్ విన్ అవ్వగా మిగిలిన వారికి కొంతమంది నెక్స్ట్ సీజన్లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.

బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కోసం ఇప్పటికే ఎంపిక మొదలై రోషన్‌, మంజూష అనే ఇద్దరు యాంకర్లను బిగ్ బాస్ టీమ్ వాళ్ళు సంప్రదించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడ మరొక వ్యక్తికి కూడా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కినట్టు సమాచారం. అతనెవరో కాదు కరాటే కల్యాణితో గొడవ పెట్టుకొని వార్తల్లో నిలిచిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి. కరాటే కళ్యాణి తో జరిగిన గొడవ కారణంగా శ్రీకాంత్ రెడ్డి ఇటీవల బాగా పాపులర్ అయ్యాడు.

యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిల తో అసభ్యంగా ప్రవర్తించే శ్రీకాంత్ రెడ్డితో కరాటే కళ్యాణి ఇటీవల గొడవ పడింది.అమ్మాయిలతో ఇలాంటి అసభ్యకరమైన ఫ్రాంక్ వీడియోలు చేస్తూ యువతని పక్కదోవ పట్టిస్తున్నాడని కళ్యాణి ఆమె అనుచరులు శ్రీకాంత్ రెడ్డీ మీద దాడి చేయటంతో అతను కూడా కళ్యాణి మీద దాడి చేశాడు. ఇద్దరు ఒకరి పై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయటంతో ఇద్దరి మీద పోలిసులు కేస్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరగవలసి ఉంది. అయితే కరాటే కళ్యాణి తో జరిగిన గొడవ కారణంగా శ్రీకాంత్ రెడ్డి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం పొందారని వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.