వేదిక పై కింద పడిపోయిన బుల్లెట్ భాస్కర్ తండ్రి తృటిలో తప్పిన ప్రమాదం..!

ప్రస్థుత కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న టీవి షో టీఆర్పీ కోసం ఏం చేయటానికైనా వెనుకాడటం లేదు. ఈ మధ్య కాలంలో టీఆర్పీ ప్రోమోను కాంట్రవర్సీ చేయడమే ప్రథమంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఒకరితో ఒకరు గొడవపడటం, ఒకరినొకరు కొట్టుకోవటం, కొన్ని సందర్భాలలో కోపంతో స్టేజ్ మీద నుండి వెళ్ళిపోవటం వంటివి చేస్తుంటారు. షో లో ప్రమాదం జరిగినట్టు చూపించి టీఆర్పీ కోసం పాకులాడుతున్నారు.ఇటీవల ఒక షో ప్రోమోలో కూడా ఇలాంటి ఓ స్టంట్ వాడేశారు. ఈటీవీ టిఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లాం చెబితే వినాలి అనే కార్యక్రమంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ రెడీ అయింది. ఈ స్పెషల్ షో వచ్చే ఆదివారం ప్రసారం కానుంది.

ఈ షోలో ఆడవారు, మగవారి మద్య పోటీలు పెట్టారు.ఈ క్రమంలో జబర్ధస్త్ కమెడియన్లతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ షో లో ఆది, రాంప్రసాద్ వంటి వారు కూడా సందడి చేశారు. ఇక బుల్లితెర నటి శ్రీ వాణీ భర్త కూడా చాలా సందడి చేశారు. ఇక ఈ షో జబర్ధస్త్ కమెడియన్ శాంతి కుమార్ తన భార్యతో కలిసి అద్భుతంగా పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక ఈ క్రమంలో మగవారికి,ఆడవారికి మధ్య తాడు లాగే పోటీ పెట్టారు. వీరు తాడు లాగే క్రమంలో తాడు కూడా తెగిపోయింది.

ఇక రెండు టీమ్ ల మధ్య కబడ్డీ పోటీ కూడా పెట్టారు. ఈ క్రమంలో శ్రీవాణి కూతకి వెళ్లి అవతలి టీమ్ లో ఉన్న తన భర్తను ఔట్ చేసింది. ఇక మగవారి వైపు నుండి బుల్లెట్ భాస్కర తండ్రి కూడా కూతకు వెళ్ళాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ కూత పెడుతూ అందరినీ ఔట్ చేయటానికి వెళ్లి సడెన్ గా పడిపోయాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు కూడా ఏం జరిగిందో అంటూ కంగారు పడుతున్నారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రోమో కోసమే ఇలాంటి చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.