తన లవ్ స్టోరీ గురించి… ఆత్మహత్య గురించి బయట పెట్టిన బుల్లెట్ భాస్కర్..!

బుల్లితెర మీద ప్రచారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి జీవితం ఇచ్చింది. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందింది వారిలో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకరు. బుల్లెట్ భాస్కర్ ఒక కమెడియన్ గా మాత్రమే కాకుండా రైటర్ గా కూడా మంచి టాలెంట్ ఉంది. అంతేకాకుండా మహేష్ బాబు వాయిస్ ని కూడా మిమిక్రీ చేస్తూ ఉంటాడు. ప్రతివారం జబర్దస్త్ లో తన టీమ్ తో కలిసి బుల్లెట్ భాస్కర్ ప్రేక్షకులని అలరిస్తుంటాడు.

ఇదిలా ఉండగా ఇటీవల భాస్కర్ తన జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కి రాకముందు తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మొదటిసారిగా బయటపెట్టాడు. ఈ క్రమంలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. జబర్దస్త్ కి రాకముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను.రెండు సంవత్సరాలు ఆ అమ్మాయి నాతో ఉండి తర్వాత నాకు చెప్పకుండా వదిలేసి వెళ్లిపోయింది. అలా ప్రేమలో మోసపోయి పిచ్చోడిలా ఊర్లు పట్టుకొని తిరిగాను. ఆ సమయంలో ఆ బాధ భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. సమయంలో జబర్దస్త్ లో అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని వదులుకోకుండా నన్ను తిరస్కరించిన వారికి నా ఎదుగుదలతోనే సరైన గుణపాఠం చెప్పాలని ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నా ఎదుగుదలే నన్ను మోసం చేసిన వారికి సరైన గుణపాఠం అంటూ బుల్లెట్ భాస్కర్ తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా జబర్దస్త్ నుండి ఫేమస్ కమెడియన్లు బయటికి వెళ్లిపోయారు. కానీ బుల్లెట్ భాస్కర్ మాత్రం జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.