ప్రస్తుత తరుణంలో ఎక్కడికైనా వెళ్లాలన్నా భయమే. దానికి కారణం కరోనా. బస్సులు, రైళ్లు, విమానాలు, ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించాలంటే వణుకు పుడుతోంది. ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని భయం. కానీ.. కొన్నిసార్లు అత్యవసర ప్రయాణాలకు వెళ్లాల్సిందే. అది మాత్రం తప్పదు. అందుకే.. కరోనా సమయంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కంటే.. తమ సొంత వాహనాలను ఉపయోగించుకోవడం మేలు అని ఆలోచిస్తోంది నేటి జనరేషన్. అందుకే.. ప్రస్తుతం బైక్స్, కార్ల సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి.
అయితే.. అందరూ బైక్స్, కార్లు కొనలేరు. వాటి రేట్లు ఎక్కువ. ఇప్పుడు బైక్ కొనాలంటే కనీసం 80 వేలకు పైనే పెట్టాలి. కారు అయితే చెప్పాల్సిన పనేలేదు.
అందుకే పెద్ద పెద్ద ఆటోమొబైల్స్ కంపెనీలు ప్రస్తుతం బడ్జెట్ ధరల్లో బైకులను అందించేందుకు ముందుకు వచ్చాయి. బజాజ్, హీరో, హోండా, టీవీఎస్ లాంటి బడా కంపెనీలు కూడా తక్కువ ధరల్లో లభించే బైక్ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్
వాటిలో ఛీప్ అండ్ బెస్ట్ బైక్ అంటే.. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అని చెప్పుకోవచ్చు. Hero HF Deluxe ప్రారంభ ధర కేవలం 46,800 రూపాయలు. దీంట్లో చాలా వేరియంట్లు ఉన్నాయి. కాకపోతే హెచ్ఎఫ్ డీలక్స్ బేసిక్ మోడల్ బైక్. ఈ బైక్ ఇంజిన్ పవర్ 97.2 సీసీ కాగా ఇది 8000 ఆర్పీఎం దగ్గర 7.94 బీహెచ్పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. సిటీల్లో ప్రయాణించేవాళ్లకు, తక్కువ దూరం రోజూ ప్రయాణించే వాళ్లకు ఈ బైక్ బెస్ట్ చాయిస్.
బజాజ్ సీటీ 100
బజాబ్ సీటీ 100(bajaj CT 100) ప్రారంభ ధర కేవలం 42,790 రూపాయలు. బజాజ్ నుంచి వచ్చే బైకుల్లో ఇదే అత్యంత తక్కువ ధర గల బైక్. దీని ఇంజిన్ పవర్ 102 సీసీ. 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉన్న ఈ బైక్ 7.9 హెచ్ పీ పవర్ జనరేట్ చేస్తుంది.
టీవీఎస్ రేడియన్
టీవీఎస్ రేడియన్(TVS Radeon) బైక్ ప్రారంభ ధర 59,742. తక్కువ ధరతో పాటుగా.. బెస్ట్ బైక్ గా రూపొందించారు. దీని ఇంజిన్ కెపాసిటీ 109.7 సీసీ కాగా… 8.08 బీహెచ్ఫీ పవర్ తో వచ్చే ఈ బైక్ కు 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ స్పోర్ట్(TVS Sport) బైక్ ప్రారంభ ధర 52,500 రూపాయలు. దీని ఇంజిన్ సామర్థ్యం 109.7 సీసీ. 4 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న ఈ బైక్ 8 హెచ్ఫీ, 8.7 ఎన్ఎం టార్క్ ను ఇస్తుంది.