Buddha Venkanna: రోజా మాటలకు విలువ లేదంటున్న బుద్ధా వెంకన్న!

Buddha Venkanna: సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజాపై తాజాగా బుద్ధ వెంకన్న షాకింగ్ కామెంట్స్ చేశాడు. నటి రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈమె రాజకీయపరంగా నిత్యం ఏదో ఒక విషయం లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇదిలా ఉంటే తాజాగా టిడిపి నేత బుద్ధా వెంకన్న వైయస్సార్ అధికారులపై విమర్శలు చేశాడు.

వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు అనేది జగన్ చెప్పాలి అంటూ అన్నాడు. అంతేకాకుండా హైదరాబాదులో ఉన్న వివేకా కుమార్తె సునీతకు రక్షణ కల్పించాలని తెలిపాడు. ఇక రోజా తమపై పలు వ్యాఖ్యలు చేసిందని.. ఆమె మాటలకు విలువ ఉండదని అందుకే ఆమె మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.