బ్రేకింగ్ : సైలెంట్ గా పెళ్లి అనౌన్స్ చేసిన టాలీవుడ్ యువ హీరో.!

టాలీవుడ్ దగ్గర ఉన్న లేటెస్ట్ యంగ్ జెనరేషన్ హీరోస్ లో ప్రముఖ హీరో నాగ శౌర్య కూడా ఒకడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో బాగా పరిచయం అయ్యిన ఈ యువ హీరో రీసెంట్ గా దర్శకుడు అనీష్ కృష్ణ తో చేసిన కృష్ణ వ్రిందా విహారి అనే సినిమాతో అలరించాడు.

ఇక ఈ ఇప్పుడు అయితే ఈ యంగ్ హీరో పై ఓ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. గత కొన్నాళ్ల కిందటే జస్ట్ తన సినిమా ప్రమోషన్స్ లోనే తన పెళ్లి టాపిక్ రాగా దాటవేసిన తాను ఇప్పుడు సైలెంట్ గా తన పెళ్లిని అనౌన్స్ చేసి సినీ వర్గాల్లో షాకిచ్చాడు.

ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే తాను అయితే అనూష అనే అమ్మాయిని వివాహం చేసుకోనున్నట్టు ఇప్పుడు అధికారికం కాగా నెక్స్ట్ ఈ నవంబర్ లోనే వీరి పెళ్లి జరిగిపోనుందట. అంతే కాకుండా ఈ 19, 20 తేదీలలో బెంగళూరులో అయితే వీరి వివాహ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నట్టుగా ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

మరి దీనిపై అయితే ఇప్పుడు ఓ కార్డు కూడా బయటకి రాగా ఈ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది. దీనితో ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్ ఈ యువ జంటకి కంగ్రాట్స్ చెబుతున్నారు.