Breaking: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం..

Breaking: కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్ ను కూడా కలవరపెడుతుంది.

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయపూర్ కు చెందిన 73 ఏళ్ళ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు. అతడికి హైపర్ టెన్షన్ తో పాటు డయాబెటిస్ కూడా ఉందన్నారు. నెగిటివ్ వచ్చాక పోస్ట్ కోవిడ్ న్యుమోనియా ఎఫెక్ట్ ద్వారా మరణించి ఉంటారన్నారు. కాగా MH లోనూ ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు తెలుస్తుంది.

కరోనా కొత్త వేరియంట్ విస్తరించకుండా ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు విధించాయి. ఇదిలా ఉంటే… రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు దేశంలో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. తాజా గా వచ్చిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ దెబ్బకు కరోనా కేసులు ఒక్కసారిగా జెట్ స్పీడ్‌తో దుసుకుపోతున్నాయి.

మొన్న 9 వేల కేసులు, నిన్న 13 వేల కేసులు, ఇవాళ 16 వేల కేసులు… ఇలా రోజురోజుకు కరోనా వేగం పెంచుకుంటుపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారంలోనే కరోనా పీక్‌ స్టేజ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా అటు మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కోల్‌కతాలో ఐతే అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం మేర కేసులు రికార్డయ్యాయి. నిన్న 540 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య దాదాపు 11వందలకు చేరింది.