బ్రేకింగ్ : పెరుగుతున్న కరోనా…మహారాష్ట్ర లో మళ్లీ లాక్‌డౌన్ !

icmr second survey report on corona spread in india

మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నప్పటికీ అక్కడ కేసులు ఏ మాత్రం తగ్గట్లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ‌లు కొవిడ్ నిబంధనలు పాటించనందున రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు లాక్ డౌన్ నిబంధనలు ఇతర ప్రణాళిక సిద్ధం చేయాల‌ని మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధికారులను ఆదేశించారు.

icmr second survey report on corona spread in india
icmr second survey report on corona spread in india

రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో అనుస‌రించాల్సిన విధి విధానాల‌పై ఆదివారం ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపేతో పాటు సీఎస్, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఠాక్రే మాట్లాడుతూ క‌రోనా కేసులు ఇలాగే పెరిగిపోతే రాష్ట్రం మౌలిక వ‌స‌తుల లేమితో ఆరోగ్య ప‌రిర‌క్షణ సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం నాడు అధికారులతో జరిపిన సమీక్షలో చర్చించారు. ఇందులో భాగంగా.. ఆహారధాన్యాల సరఫరా, మందులు, అత్యవసర సేవలు, వైద్య సౌకర్యాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఒకవేళ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రభుత్వం యంత్రాంగం మధ్య ఎటువంటి సమన్వయలోపం లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యద‌ర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 3.75 ల‌క్షల ఐసోలేష‌న్ బెడ్లు, 1.07 ల‌క్షల బెడ్లు నిండిపోయాయ‌ని చెప్పారు. 60,349 ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా బెడ్లు ఉన్నాయ‌ని, వాటిలో 12,701 బెడ్ల‌పై రోగులు ఉన్నార‌ని చెప్పారు. ఇంకా క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగితే.. హెల్త్ కేర్ మౌలిక వ‌స‌తుల కొర‌త ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.