బ్రేకింగ్ రిజల్ట్స్ : నిజామాబాద్ ఉప ఎన్నికల్లో అనుకుందే జరిగింది.

kavitha

 నిజామాబాదు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలైయ్యాయి. ఇందులో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించింది. ముందుగా అనుకున్న ప్రకారమే ఆమె విజయం నల్లేరు మీద నడకలాగా సాగింది. స్థానిక తెరాస నేతల కృషి, పార్టీ అధినాయకత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు కవిత విజయంలో ప్రధాన పాత్రలు పోషించాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు స్థానిక పాలిటెక్నీక్ కళాశాలలో కౌంటింగ్ మొదలయ్యింది.

kavitha telugu rajyam

 మొదటి రౌండ్ లో 600 ఓట్లు, రెండో రౌండ్ లో మిగిలిన 233 ఓట్లు కౌంటింగ్ చేస్తారు. మొదటి రౌండ్ పూర్తిఅయ్యే లోపే కవిత విజయం ఖాయం అయ్యింది. 600 ఓట్లు గాను, 531 ఓట్లు కవిత కైవసం చేసుకుంది. ఇక రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 728 ఓట్లు సాధించింది. బీజేపీ కి 56, కాంగ్రెస్ కి 29 ఓట్లు మాత్రం దక్కాయి. నిజానికి అక్కడ తెరాస బలం కేవలం 505 ఓట్లు మాత్రమే, కానీ అనూహ్యంగా 728 ఓట్లు రావటం విశేషం, కాంగ్రెస్ కి చెందిన దాదాపు 100 మందికి పైగా ప్రజా ప్రతినిధులు తెరాసకి మద్దతు పలికారు. దీనితో ఆమెకి అనూహ్యమైన గెలుపు సాధ్యమైంది. దీనితో కవిత కోరిక తీరిపోయి, ఆమె కూడా చట్టసభల్లో భాగమైంది.

  ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కవిత గెలుపుకంటే కూడా, కాంగ్రెస్ పార్టీ దీనావస్థ గురించి, దాదాపు 140 పైగా ప్రజాప్రతినిధులు కలిగి వున్నా ఆ పార్టీ, ఈ ఎన్నికల్లో కేవలం 29 ఓట్లు మాత్రం సాధించగలిగిదంటే ఆ పార్టీ నాయకత్వం ఎంత అసమర్థంగా పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు, బీజేపీ పార్టీకి 66 మంది ప్రజా ప్రతినిధులు ఉంటే 59 ఓట్లు సాదించారంటే, ఆ పార్టీ తమ వాళ్ళని ఎలా కాపాడుకుంటూ, వాళ్ళకి నమ్మకం కలిగించటంలో విజయం సాధించింది. కానీ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యింది. దీని ప్రభావం కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మీద పడే అవకాశం వుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ఆ స్థానాల్లో కి బీజేపీ రాబోతుందనే మాటలు వినవస్తున్నాయి. ఈ ఎన్నికల పలితాలతో తెరాసకు సరైన పోటీదారులు బీజేపీ అని దాదాపుగా కంఫర్మ్ అయ్యింది. ఇకనైనా కాంగ్రెస్ సీనియర్ నేతలు గొడవలు పడటం మానుకొని పార్టీ బలోపేతం కోసం కష్టపడితే మంచిది.