బ్రేకింగ్ : ఆ మంత్రిగారికి ఉద్వాసన ? ఏం జరగబోతోంది ఏపీ లో ?

ap cm jagan

 జగన్ తన మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు గత కొద్దీ రోజులుగా మీడియా సర్కిల్ లో నానుతున్న మాట. మొదటిసారి తన నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలోనే ఈ మంత్రి పదవులు కేవలం కొన్ని రోజులు మాత్రమే అని, రెండేళ్లు తర్వాత ఖచ్చితంగా మంత్రుల పనితీరును గమనించి పనితీరు సరిగ్గా లేని మంత్రుల యొక్క శాఖలను మార్చటం కానీ, లేదా ఆయా మంత్రులకు ఉద్వాసన పలకటం కానీ చేయటం జరుగుతుందని సీఎం జగన్ చెప్పాడు.

ap cm jagan

 అయితే రెండేళ్ల కాకముందే మంత్రి వర్గంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత కూడా లేదు. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్ళేముందు సీఎం జగన్ కొన్ని కీలక విషయాల్లో కొన్ని సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో కొన్ని మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది.

 ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన పనితీరు వలన ఇబ్బందులు ఏమి లేకపోయినా కానీ, మరికొన్ని అంతర్గత కారణాలు వలన ఆయన స్థానంలో మేకపాటి గౌతమ్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనకు ఆయనతో కలిసి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే మేకపాటి గౌతంరెడ్డి శాఖ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అప్పగించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

అంతేకాకుండా కొంతమంది సీనియర్ మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందని ఎక్కువ శాఖల మంత్రులు తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఒక ఇద్దరు ముగ్గురు మంత్రుల విషయంలో సీఎం జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది, వాళ్ళను మంత్రి వర్గం నుండి తప్పించే అవకాశం లేకపోలేదు. అయితే మంత్రి వర్గం అనే తుట్టెను కదిలిస్తే అనేక సమస్యలు రావచ్చు మరి సీఎం జగన్ వాటిని ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.