Kannappa: మరో వివాదంలో కన్నప్ప… బ్యాన్ చేయాలంటూ డిమాండ్… ఇదేంటి శివయ్యా!

Kannappa: మంచు విష్ణు కన్నప్ప సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.. అయితే ఈ సినిమా విడుదలకు అదే స్థాయిలో ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. ఇటీవల సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ కావడం సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. కన్నప్ప సినిమా బ్రాహ్మణులల్లో అవమానిస్తూ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది అంటూ బ్రాహ్మణలు ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మంచు కుటుంబంలోని హీరోలు గతంలో బ్రాహ్మణుల గురించి ఎన్నో సినిమాలు చేశారు. అయితే ప్రతి సినిమాలో కూడా వీరు బ్రాహ్మణులను కించపరిచే విధంగానే సినిమాలు చేశారని తెలిపారు. గతంలో దేనికైనా రెడీ అనే సినిమాలో బ్రాహ్మణులు హలీం తింటున్నట్టు చూపించారు. ఇలాంటి సన్నివేశాలు చేయటానకి వారికి అభ్యంతరం లేకపోయినా మా బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలేదని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పాత్రపై స్పష్టత ఇస్తేనే బాగుంటుందని లేదంటే కోర్టును ఆశ్రయించి సినిమా ను అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీధర్ హెచ్చరించారు. దీనిపై చిత్ర యూనిట్ వారు ఆలోచనలో పడ్డారు. ఇలా ఒక సమస్యను అధిగమించి ముందుకు వెళ్తుంటే కన్నప్ప సినిమా వరుసగా వివాదాలలో నిలుస్తూ ఉంది. మరి బ్రాహ్మణ సంఘాల నుంచి వ్యక్తమవుతున్న ఈ డిమాండ్లపై కన్నప్ప చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.