బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం అందరికీ తెలిసిందే. ఇదివరకే తన మాజీ భర్త విషయంలో ఆమె చాలా ఘోరమైన అవమానాలు ఎదుర్కొంది. ఇక అతని నుండి విడిపోయాక ఈమధ్య ఆదిల్ ఖాన్ తో రిలేషన్ లో ఉంది. కానీ తాజాగా అతడు తనకి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
తాజాగా ఆమె ముంబై ఎయిర్పోర్టులో కనిపించగా.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆమె చాలా డల్ గా కనిపించడంతో పాటు.. కొన్ని విషయాలు కూడా బయట పెట్టింది. ఆదిల్ కోసం తను ఇలా రెడీ అయ్యాను అంటూ.. ఫ్లైట్ లో రెండు గంటల పాటు ఏడవడంతో తన కాజల్ చెరిగిపోయింది అని తెలిపింది.
ఇక అతడికి ఇప్పుడు కాల్ చేయడం లేదని.. ఆత్మగౌరవమే నా వ్యక్తిత్వం అంటూ.. తను నిన్ను ఢిల్లీకి వెళ్ళగా.. ఈరోజు తిరిగి వచ్చానని తెలిపింది. తన బాయ్ ఫ్రెండ్ తనను కలుసుకునేందుకు రాలేదని.. తాము ఇద్దరం కలిసి ముంబైకి రావాల్సి ఉందని.. తను ఎంతో బాధలో ఉన్నానని తెలిపింది.